Chittur: చిత్తూరు మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో చిత్తూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరి శిక్ష విధించింది. ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరిగిందన్న కారణంతో కోర్టు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించింది. 2015 నవంబర్ 17న చిత్తూరు (chittur) నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ దారుణ హత్యకు దాదాపు పదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది.
Read also: Latest Telugu News : Montha Cyclone : తెలుగు నేల కకావికలం
Chittur: మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలనo
Chittur: ఈ కేసులో చంద్రశేఖర్ అలియాస్ చింటూ (A1) ప్రధాన నిందితుడు కాగా, ఇతను మృతుడు కఠారి మోహన్ మేనల్లుడు. మరో నలుగురు నిందితులు వెంకటాచలపతి (A2), జయప్రకాష్ రెడ్డి (A3), మంజునాథ్ (A4), వెంకటేష్ (A5)గా గుర్తించారు. మొదట 23 మంది నిందితులను చేర్చినా, A6 నుండి A23 వరకు ఉన్నవారిపై కేసులను కోర్టు కొట్టివేసింది. బురఖాలు ధరించిన దుండగులు తుపాకులు, కత్తులతో మేయర్ దంపతులను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయ, కుటుంబ విభేదాలే ఈ ఘటనకు కారణమని విచారణలో వెల్లడైంది. మొత్తం 122 మంది సాక్షులను విచారించిన అనంతరం కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. నిందితులు త్వరలోనే ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశం ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: