చిత్తూరు : చిత్తూరు టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 2వ తేదీ అదృశ్యమైన మహిళ బుధవారం (Chittoor) చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల పరిధిలోనీ నీవా నదిలో మృతదేహమై తేలింది. చిత్తూరు గిరింపేటలో నివాసం వుంటున్న కవిత(38) డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి గుడికి వెళ్ళి వస్తానని బయలుదేరి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ మేరకు కవిత సోదరుడు ఎస్.కిరణ్(34) జనవరి 2వ తేదీ రాత్రి 9 గంటలకు టుటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుడికి వెళ్ళి వస్తానని చెప్పిన కవిత తిరిగి ఇంటికి రాలేదని, ఫోన్లో ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆమె సమాధానం ఇవ్వడం లేదని, అనంతరం తాను వికలాంగుల సంఘ అధ్యక్షుడైన మురళీ ఇంటికి వెళ్ళి తన సోదరి గురించి వివరాలు అడిగానని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read also: AP: నైతిక విలువలతో కూడిన విద్య అత్యంత అవసరం: ఉప శాసనసభాపతి
వాయిస్ మెయిల్ ఆధారంగా హత్య అనుమానాలు
అప్పుడు మురళీ చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అడిగారని అందుకు చంద్రశేఖర్ తనకు కవిత ఒక వాయిస్ మెయిల్ పంపిందని చెప్పాడు. (Chittoor) ఆ మెసేజ్లో గణేష్ అనే వ్యక్తి తనను పెళ్ళి చేసుకున్నాడని, అతను తనని తనతో పాటు తీసుకెళ్తున్నాడని సైతం కవిత వాయిస్ మెయిల్లో పేర్కొంది. ఆపై కిరణ్ కవిత కోసం చిత్తూరు నగరం మొత్తం గాలించగా రాఘవ ధియేటర్కు సమీపంలో కవిత స్కూటర్ పార్క్చేసి కన్పించింది. అక్కడ వున్న వారిని కిరణ్ ప్రశ్నించగా స్కూటర్ పార్క్ చేసి మహిళ ఆటో ఎక్కి వెళ్ళిందని సమాచారం ఇచ్చారు. అలా వెళ్ళిన మహిళ గంగాధరనెల్లూరులోని నీవా నది బ్రిడ్జి కింద మృతదేహమై తేలింది. కవిత ఇచ్చిన వాయిస్ మెయిల్ మేరకు పెళ్ళి చేసుకున్న గణేష్ కవితను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు సైతం గణేష్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు గణేష్ పట్టుబడితే కాని వాస్తవాలు తెలిసే అవకాశాలు వున్నారు. ఈ మేరకు టుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: