చిత్తూరు జిల్లాలో నేటికీ బిసిలకు రుణాలు మంజూరుకాని వైనం
చిత్తూరు ; రాష్ట్రంలో అధికారంలో వున్న కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు పేరిట మరోసారి వెనుకబడిన తరగతుల వారిని బకరాలను చేసింది. (Chittoor) రాష్ట్రంలో గతంలో ఐదేళ్ళ పాటు అధికారంలో వున్న వైకాపా ప్రభుత్వం(Government) బిసీలను విస్మరించిందని, తాము అధికారంలోకి వస్తే బిసీలకు స్వర్ణయుగమేనని ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి ఊదరగొట్టిన ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం తన అసలు రూపం మరోసారి బహిర్గతపరచింది. రాష్ట్రంలో గతంలో అధికారంలో వున్న వైకాపా ప్రభుత్వం బిసీలకు బిసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసి బిసీలకు ఇతర సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బిసీ కార్పొరేషన్ ద్వారా బిసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించి వారి నుండి దరఖాస్తులు ఆహ్వానించి, రుణం కోసం దరఖాస్తు చేసుకున్న బిసీల దరఖాస్తులు వడపోసి ఇంటర్వ్యూలు నిర్వహించి, బ్యాంకర్లతో కలిసి లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి, జిల్లా స్థాయి బహిరంగ వేదికలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు లబ్దిదారులకు మెగా చెక్కును సైతం అందజేసి, ఆపై బ్యాంకులో రుణం మంజూరు సమయానికి బ్రేక్ బేక్ వేసి కూటమి ప్రభుత్వం బిసీలను మరింత నమ్మకద్రోహానికి పాల్పడింది. బిసీ సబ్సిడీ రుణాల కోసం ఎంపికైన లబ్దిదారులు ఇటు అధికారులు, బ్యాంకుల చుట్టూ ఏడు నెలలుగా ప్రదిక్షిణలు చేస్తున్నప్పటికీ వారికి ఇటు అధికారులు, అటు బ్యాంకర్లు ఎలాంటి సమాధానం చెప్పక పోవడంతో లబ్దిదారులు మరింత కృంగి కృశించిపోతున్నారు.
Read Also: AP Crime: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం
బ్యాంకుల వైఖరి మధ్య చిక్కుకున్న బిసీ లబ్ధిదారులు
సాధారణంగా సబ్సిడీ రుణాల మంజూరుకు సంబంధించి అధికారులు, బ్యాంకర్లు కలిసి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. వారికి బ్యాంకులు సబ్సిడీ రుణం మంజూరు చేస్తాయి. ఆపై ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీ మొత్తంను జమ చేస్తోంది. (Chittoor) మరోవైపు లబ్దిదారులు బ్యాంకు నుండి తాను పొందిన రుణంకు సంబంధించి నెలవారీ కంతులు కట్టడం అనవాయితీ. అయితే ఈ సారి బ్యాంకులు బిసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల గ్రౌండింగ్కు మోకాలడ్డు తున్నాయి. ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో బిస్ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల మంజూరుకు సంబంధించి బ్యాంకులకు ఆడ్వాన్స్ సబ్సిడీ జమ చేస్తామని, ఆపై లబ్దిదారుడికి సబ్సిడీ రుణంను బ్యాంకులు అందించాలని పేర్కొంది. ఈ మేరకు బ్యాంకర్లు ప్రభుత్వం నుండి అడ్వాన్స్డ్ సబ్సిడీ బ్యాంకులకు జమ అయితే ఆపై రుణం గ్రౌండింగ్ను పరిశీలిస్తామని పేర్కొంటుండటంతో జిల్లాలోని బ్యాంకులు ఇప్పటి వరకు ఒక్క బిసీ సబ్సిడీ రుణ యూనిట్ను గ్రౌండింగ్ చేయని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ ఏడాది మార్చి నెలలో బిసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు మార్చి నెలలోనే నగరం, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాలు, మండలాల పరిధిలో ఎంపిడిఓ కార్యాలయాల్లో అధికారులు, బ్యాంకర్లు కలిసి దరఖాస్తు దారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసింది. ఆపై జిల్లా
కేంద్రం చిత్తూరులో ఏప్రిల్ 11వ తేదీ జరిగిన బాబు జగ్జీవన్రామ్ జయంతి పురస్కరించుకుని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ 5088 మురళీమోహన్ లు 535 మంది లబ్దిదారులందరికీ కలిపి రూ.11.58 కోట్ల మెగా చెక్కును పంపిణీ చేశారు.
మెగా చెక్కుల పంపిణీ..
బిసీ సబ్సిడీ రుణాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెగా చెక్కును అందజేయడంతో లబ్దిదారులు అప్పుడే సబ్సిడీ రుణం మంజూరు అయ్యిందని సంబరపడ్డారు. లబ్దిదారులకు మెగా చెక్కులు పంపిణీ చేయడంతో(Chittoor) ఇక వారం రోజుల్లో బ్యాంకులు బిసీ సబ్సిడీ రుణాలను మంజూరు ప్రక్రియకు శ్రీకారం చుడుతుందని ఆశలు పెట్టుకున్నారు. బ్యాంకుల నుండి నెలల తరబడి బిసీ సబ్సిడీ రుణం మంజూరుకు సంబంధించి పిలుపు రాకపోవడంతో లబ్దిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదిక్షిణలు చేయడం ప్రారంభించారు. బ్యాంకులు ప్రభుత్వం నుండి సబ్సిడీ రుణాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని, ప్రభుత్వం నుండి ఎదైనా సమాచారం వస్తే అప్పుడు చూస్తామని చెప్పి పంపుతున్నారు. ఈ మేరకు లబ్దిదా రులు ఎంపిడిఓ కార్యాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నప్పటికీ తమకు ఈ వ్యవహారంలో సంబంధం లేదని బిసీ కార్పొరేషన్ అధికారులను వెళ్ళి కలవాలని సమస్యను వారిపై నెట్టివేస్తున్నారు. అయితే ఈ విషయంపై బిసీ కార్పొరేషన్ అధికారులు స్పందించ డం లేదు. ప్రభుత్వం ఈ విషయంను పరిశీ లించి ఇప్పటికైనా బిసీ సబ్సిడీ రుణాల మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: