పెళ్లి కాని యువకుల కోసం ఓ గ్రామంలో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పెళ్లి కాని అబ్బాయిలు ఏం చేస్తారు.. ఏ మ్యాట్రిమోని సైటో లేదా తెలిసిన వాళ్ల ద్వారా అమ్మాయిల్ని వెతుకుతారు. ‘ఇలా మా ఇంట్లో అబ్బాయి ఉన్నాడు.. మంచి అమ్మాయి ఉంటే చూసి పెట్టండి.. మావాడికి పెళ్లి చేస్తాం’ అంటూ చెబుతుంటారు. (Chittoor) తాజా గా ఓ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ఊర్లో మంచి కుర్రాళ్లు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఏకంగా వాళ్ల ఫోటోలతో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేశారు. ఆ ఫ్లెక్సీలో కనిపిస్తున్న యువకులకు మంచి వధువులు కావాలెను అని పెట్టి పెళ్లి కాని యువకులకు స్టార్ మార్క్ పెట్టారు. పండుగకు గ్రామానికి వచ్చే వారు ఈ ఫ్లెక్సీ చూసి షాక్ అయ్యారు ఆ అసలు విషయం తెలిసి నవ్వుకున్నారు.
Read Also: Srikakulam: అరసవల్లిలో రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు
సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఐడియా
చిత్తూరు జిల్లా (Chittoor) ఐరాల మండలంలోని కలికిరిపల్లెలో సంక్రాంతి సందర్భంగా ఆదివారం పశువుల పండగ నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పలువురు యువకులు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువకుల ఫొటోలపై స్టార్ గుర్తులు ముద్రించారు. ముఖ్య గమనిక.. స్టార్ గుర్తు కలిగిన యువకులకు వధువులు కావాలి అని ముద్రించడం కొసమెరుపు. దీన్ని చూసి ప్రతిఒక్కరూ ఇదేదో బాగుందని చర్చించుకున్నారు. వివాహాలు కానీ యువకులు కొత్త తరహా ప్రచారం చేయడం సోషల్ మీడియాలో(Social media) చర్చనీయాంశమైంది. స్టార్ మార్కులతో సినిమా స్టైల్‌లో పెట్టిన బ్యానర్లు గ్రామస్తులను నవ్విస్తున్నాయి. గ్రామీణ పండుగను వేదికగా చేసుకుని పెళ్లి సంబంధాల కోసం యువకులు చేసిన ఈ వినూత్న ప్రచారం ఊరంతా హాట్ టాపిక్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: