,ధైర్య స్పర్శ, బాల్యవివాహ నిరోధక చట్టం, పాక్సో చట్టం, హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం, శక్తి యాప్ ప్రాముఖ్యతపై బుదవారం అవగాహన కల్పించిన చిత్తూరు (Chittoor) మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా. చిత్తూరు జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాల లో నర్సింగ్ విద్యార్థుల కు అవగాహన కల్పించారు.
Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ ఐ మాట్లాడుతూ, మీరంతా భవిష్యత్తు పౌరులు. అందుకే చిన్న వయసులోనే మీకు మంచి–చెడు తెలిసేలా అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. గుడ్ టచ్ ,బ్యాడ్ టచ్ గుర్తించగలగాలి. ఎవరైనా అనవసరంగా తాకితే, మీకు అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే నో అని చెప్పి, నమ్మకమైన గురువుకి , తల్లి తండ్రులకు , పోలీసులకు చెప్పాలి.
పోక్సో చట్టం చాలా కఠినమైనదనీ,18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగితే దానికి కఠినమైన శిక్షలు ఉంటాయన్నారు. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైతే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి. అత్యవసర పరిస్థితుల్లో 112 (ఎమర్జెన్సీ నంబర్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), వంటి హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలి.
ఇవి మీకు వెంటనే సహాయం అందిస్తాయి
మహిళలు కోసం ప్రభుత్వం అందించిన శక్తి యాప్ చాలా ఉపయోగకరమైనది. ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఆ యాప్‌లో సులభంగా పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. మీ భద్రత కోసం తప్పనిసరిగా ఈ యాప్ ఉపయోగించాలి.మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అత్యవసర సమయంలో ఒకే (SOS) బటన్ ప్రెస్ చేయగానే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుంది.
ఈ యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, అత్యవసర సేవలు అందించేందుకు ఇది ఎంతో మేలైన సాధనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: