Chittoor: ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!

Read Time:  1 min
Chittoor: ర్యాగింగ్ వద్దు.. యాంటీ ర్యాగింగ్ ముద్దు: విద్యార్థులకు పోలీసుల క్లాస్!
FONT SIZE
GET APP

Chittoor: దేశానికి రేపటి పౌరులైన నేటి విద్యార్థులను చట్టాలపై అవగాహన కలిగిన బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లా పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Read Also: Ambati Rambabu: రాంబాబుతో పాటు వైసీపీ నేతలపై మరో కేసు

ఈ క్రమంలో శనివారం పూతలపట్టు మండలంలోని ఎస్.వి. ఇంజనీరింగ్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు ఇన్స్పెక్టర్ డి. గోపి హాజరై విద్యార్థినీ, విద్యార్థులకు “యాంటీ ర్యాగింగ్, క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, ఓపెన్ బుజింగ్, గాంజా, ధైర్యా-స్పర్శ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది విద్యార్ధులు మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

Chittoor: No to ragging.. Anti-ragging kiss: Police class for students!
Chittoor: No to ragging.. Anti-ragging kiss: Police class for students!

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ డి. గోపి మాట్లాడుతూ, కళాశాలల్లో ర్యాగింగ్‌కు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ర్యాగింగ్ అనేది సరదా కోసం చేసే పని కాదని, అది బాధితుల మానసిక స్థితిని తీవ్రంగా దెబ్బతీసి వారి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. “ర్యాగింగ్ వద్దు… యాంటీ ర్యాగింగ్ ముద్దు” అనే నినాదాన్ని ప్రతి విద్యార్థి తన జీవన సూత్రంగా తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయడంతో పాటు కళాశాల స్థాయిలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్‌లు ఏర్పాటు చేసి పూర్తిగా అరికడతామని తెలిపారు.

అలాగే మహిళలపై నేరాల అంశంపై మాట్లాడుతూ, మహిళలకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళలపై జరిగే వేధింపులు, సోషల్ మీడియా ద్వారా చేసే దూషణలు చట్టరీత్యా నేరాలని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని విద్యార్థులకు వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలు, సహాయక సేవల గురించి కూడా అవగాహన కల్పించారు.

ఓపెన్ బుజింగ్, మద్యం సేవించడం మరియు గాంజా వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత జీవితాలు ఎలా దారి తప్పుతున్నాయో ఉదాహరణలతో వివరించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చదువులపై, కుటుంబ జీవితం పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. గాంజా కలిగి ఉండటం లేదా వినియోగించడం చట్టవిరుద్ధమని, దీనికి కఠిన శిక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ
డూ డిప్రారంభించిన ప్రతిష్టాత్మక “ధైర్య స్పర్శ” కార్యక్రమం ఉద్దేశ్యం — ప్రజల్లో భయాన్ని కలిగించే ప్రాంతాలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకునే ప్రదేశాలను గుర్తించి, వాటిని ప్రజలు ధైర్యంగా సంచరించే సురక్షిత ప్రాంతాలుగా మార్పు చేయడమేనని తెలిపారు. మీ పరిసరాల్లో ఇలాంటి ప్రదేశాలు ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అందిన సమాచారం ఆధారంగా ఆయా ప్రాంతాలను “ధైర్య స్పర్శ – భయానికి ముగింపు, భద్రతకు ఆరంభం” భావనతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

జిల్లా పోలీసులు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ యువతను సరైన దిశలో నడిపించేందుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.