AP: చిత్తూరు(Chittoor) జిల్లా వాసి అయిన 65 ఏళ్ల గోవింద రెడ్డి తనకు ఎదురవుతున్న సమస్యలను వివరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నివాసానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన సమయంలో పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
Read Also: TG Crime: డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు
తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన బాధితుడు
ఘటనను గమనించిన సిబ్బంది వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో ఆయనను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై గోవింద రెడ్డితో పాటు వచ్చిన రెడ్డప్ప అనే వ్యక్తి స్పందిస్తూ, పోలీసులు అవసరానికి మించిన కఠినత ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: