📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Chittoor: వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

Author Icon By Aanusha
Updated: January 9, 2026 • 7:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లి చేసుకుందాం అని పదే పదే అనడంతో, పెళ్లి చేసుకుందాం అని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి కవితను హత్య చేసిన ముద్దాయి గణేష్, స్టేట్ లెవెల్ క్రికెట్ ఆటగాడు, 2021వ సంవత్సరం ఐపిఎల్ రాజస్థాన్ రాజ్ వాడ్స్ టీం తరుపున ఆడుతూ, ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ క్రికెట్ నందు ఆడుతూ 2023 వ సంవత్సరం ఇండియన్ ఇంటర్నేషనల్ వికలాంగుల క్రికెట్ టీంకు సెలెక్ట్ కాబడి ఇండియా-నేపాల్ మ్యాచ్ ఆడాడు.

Read Also: Rayachoti Road Accident: ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

కేసు నమోదు

చిత్తూరు (Chittoor) కి చెందిన సి. కవిత గత ఏడాది డిసెంబర్ 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా ఆచూకీ లభించలేదు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మురళి ద్వారా విషయం పోలీసులకు చేరింది. కవిత, గణేష్ అనే వ్యక్తితో వివాహ ఉద్దేశంతో ఠాణా వైపు రావాలని చెప్పినట్లు, అలాగే “నాకేమైనా జరిగితే గణేష్‌ను వదిలిపెట్టవద్దు” అనే వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలిసింది.

అనంతరం ఆమె సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు చిత్తూరు (Chittoor) 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా కవిత మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బంధువులతో కలిసి ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో పలు బృందాలుగా విస్తృతంగా గాలించారు. గ్రామ ప్రజలకు, సర్పంచ్ భాస్కర్‌కు సమాచారం ఇచ్చి వివరాలు తెలియజేయాలని కోరారు.

Chittoor: Ganesh, accused in the murder case of a disabled woman, arrested

ప్రాథమిక నిర్దారణ

సీసీ కెమెరాల పరిశీలనలో రాఘవ థియేటర్ వద్ద కవిత వాహనం నిలిపి ఆటోలో వెళ్లినట్లు గుర్తించి, సంబంధిత ఆటో డ్రైవర్‌ను విచారించి ఆమె దిగిన ప్రాంతాల్లో కూడా గాలింపు చేపట్టారు.దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో, సాంకేతిక చర్యలలో బహుదా నది బ్రిడ్జి కింద ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించబడింది.

అది కవితదే అని నిర్ధారించడంతో, మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం విచారణలో అనుమానితుడైన గణేష్ ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కట్టమంచి Y జంక్షన్, మైదా ఫ్యాక్టరీ వద్ద ఒక అద్దె రూమ్ లో ఉన్న గణేష్ ను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ChittorCrime Ganesh murder case Kavitha murder latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.