Chittoor District: కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్

Read Time:  1 min
Chittoor District: కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్
Chittoor District: కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల సరుకుతో 8 మంది అరెస్ట్
FONT SIZE
GET APP

Chittoor District: గంజాయి అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపిన కుప్పం అర్బన్ పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రత్యేకంగా అభినందించారు. చిత్తూరు జిల్లా లో యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా, గంజాయి విక్రయాలను నివారించాలని చిత్తూరు జిల్లా ఎస్.పి. తుషార్ డూడి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ ఎస్.ఆర్.రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో చిత్తూరు జిల్లా లో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైనది.

ఈ క్రమంలో కుప్పం డీఎస్పీ పార్ధసారధి ఆధ్వర్యంలో రాబడిన సమాచారం మేరకు సోమవారం ఒరిస్సా నుండి కేరళకు గంజాయి అక్రమ రవాణ జరుగుతున్నదని, ఈ మద్యలో కుప్పం నందు బస చేస్తారని కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య కి సమాచారం అందింది. కుప్పం ఎస్‌ఐ బాబు సిబ్బందితో కలిసి కుప్పం పట్టణ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారు 20 లక్షలు విలువ గల 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని వెస్ట్ బెంగాల్ కు చెందిన 8 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు. ముద్దాయిలను రిమాండ్ కు తరలించడమైనది.

Read Also: Chittoor: “మహిళా వారోత్సవాలు” ఘనంగా నిర్వహిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు.

Chittoor District: కుప్పంలో గంజాయి స్వాధీనం 20 లక్షల  సరుకుతో 8 మంది అరెస్ట్
Chittoor District: 8 arrested with 20 lakhs worth of ganja seized in Kuppam

అరెస్ట్ అయిన వారి వివరములు:

1) S.K.హాసిబుల్, వయస్సు 23 సం.లు,సీతానగర్ గ్రామం, సాగర్పర పోస్ట్, బెర్హాంపుర్ తాలూకా, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం.
2) S.K.నామిజుల్, వయస్సు 20 సం.లు సీతానగర్ గ్రామం, సాగర్పర పోస్ట్, బెర్హాంపుర్ తాలూకా, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం.
3) సౌమిక్ మండల్, వయస్సు 23 సం.లు నబింగ్రామ్ గ్రామం, సాగర్పర పోస్ట్, బెర్హాంపుర్ తాలూకా, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్.
4) సుమన్ దాస్, వయస్సు 20 సం.లు నబింగ్రామ్ గ్రామం, సాగర్పర పోస్ట్, బెర్హాంపుర్ తాలూకా, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం
5) S.K.హాసినూర్ జమాన్, వయస్సు 31 సంవత్సరాలు, ఖాజీపర గ్రామం, జాలంగి పోస్టు, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం.
6) ముత్తకిమ్ మాలిత, వయస్సు 23 సంవత్సరాలు, పరాష్ పూర్ గ్రామం, దొరంపూర్ పోస్టు, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం
7) కిరణ్ మండల్, వ.27 సం.లు, పరాస్ పూర్ గ్రామం, దొరంపూర్ పోస్టు, జోలాంగి పోలీస్ స్టేషన్, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్.
8) మోజమ్ మండల్, వయస్సు 54 సం.లు, కిత్తనీయ పారా, షాబ్రాన్ పూర్ పోస్టు, జోలాంగి పోలీస్ స్టేషన్, ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని కుప్పం డీఎస్పీ పార్ధసారధి తెలిపారు. ఎవరైనా గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించినా, విక్రయించినా లేదా సేవించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరడమైనది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.