చిత్తూరు(Chittoor Crime) జిల్లా గుడి పాల మండల పోలీసులు తమిళనాడులో పేరు మోసిన రౌడీషీటర్ అలెక్స్ (30)ను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తమిళనాడులో అలెక్స్ రౌడీ షీటర్గా పేరుగాంచాడు. ఇతనిపై తమిళనాడు పోలీసులు 50కి పైగా కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో గుడిపాల మండలంలో ఓ యువతిని పలుమార్లు అత్యాచారం(rape) చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అలెక్స్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఎస్ఐ రామ్మోహన్ వెల్లడించిన వివరాల మేరకు గుడిపాల మండలం అనుపు ఎస్టీ కాలనీలో నివాసం వుంటున్న ఓ వ్యక్తికి తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన అలెక్స్ ఏడాది క్రితం మద్యం షాపు వద్ద పరిచయం అయ్యాడు.
Read Also: Medak Crime: మెదక్ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య…
యువతిపై అలెక్స్ పలుమార్లు అత్యాచారం
అలెక్స్ ని ఆ వ్యక్తి తనతో పాటు అనుపు ఎస్టీ కాలనీలో వున్న తమ ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. అప్పటి నుండి అలెక్స్ ఆ వ్యక్తి కుటుంబసభ్యులతో పరిచయం పెంచుకుని కుటుంబంలోని ఓ యువతిని భయపెట్టి లొంగదీసుకున్నాడు. ఆ యువతిపై అలెక్స్ పలుమార్లు అత్యాచారం చేస్తున్నప్పటికీ ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను సైతం బెదిరించడంతో వారు నోరు తెరిచేవారు కాదు. పలుమార్లు ఇంట్లోని వ్యక్తులను అలెక్స్(Alex) బెదిరించి కొట్టడంతో ఒక్కో సారి అలెక్స్ ఇంటికి వచ్చాడంటే ఇంట్లో ఆ యువతిని మాత్రం వదలి కుటుంబసభ్యులు సమీపంలో వున్న అడవికి వెళ్ళిపోయే వారు.
ఈ క్రమంలో పలుమార్లు అలెక్స్ చేతిలో అత్యాచారంకు గురైన యువతి తెగించి గుడిపాల పోలీసు స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ అలెక్స్ ని అదుపులోకి తీసుకుని అతనిపై అత్యాచారయత్నం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలెక్స్ పై తమిళనాడు, కర్నాటక రాష్ట్రల్లో 50కి పైగా కేసులు వున్నట్లు సమాచారం. ఇతని ఆర్థిక లావాదేవిలు నెలకు కోట్ల రూపాయలకు పైబడి వుండటంతో ఇతనిని బెయిలుపై విడిపించడానికి పెద్ద సంఖ్యలో లాయర్లు సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో గుడిపాల పోలీసులు అలెక్స్ను అరెస్టు చేశారని సమాచారం తెలియడంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సిఐడి పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు గుడిపాల వచ్చి అతనిని తమకు అప్పగించాలని ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చినట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: