📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chittoor Crime: చిత్తూరు లో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Tejaswini Y
Updated: November 5, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిత్తూరు(Chittoor Crime) జిల్లాలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మళ్లీ విషాదం చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే రెండవ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థుల వరుస ఆత్మహత్య(suicide)లతో తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంగారెడ్డిపల్లికి చెందిన రుద్రమూర్తి (19), తన తల్లిదండ్రులు శశికుమార్‌, తులసి కుమారుడు. ఈయన సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుండగా, మంగళవారం కాలేజీ భవనం నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుద్ర అక్కడికక్కడే మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read Also: Telangana: విద్యా రంగం పతనం – కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ విమర్శలు

ఈ ఘటనపై రుద్రమూర్తి తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకుల వేధింపులే తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. రుద్ర మరణ వార్త తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మహిళలను లాగడంతో ఇద్దరు మహిళలు స్పృహ తప్పినట్లు సమాచారం. వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు కళాశాల డీన్‌నే రుద్ర మృతికి బాధ్యుడిగా ఆరోపిస్తూ నినాదాలు చేశారు. తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం సమయానికి సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కాలేజీ యాజమాన్యం రుద్ర మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని చెప్పడం కుటుంబ సభ్యులను మరింత ఆగ్రహానికి గురి చేసింది.

నెలలోనే రెండవ ఆత్మహత్య

గత నెల 31న ఇదే కళాశాలలో నందిని అనే విద్యార్థిని మూడవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె వేలూరు సిఎంసి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వరుసగా రెండు ఘటనలు ఒకే కళాశాలలో జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభం

Chittoor Crime: చిత్తూరు తాలూకా పోలీసులు ఈ రెండు ఘటనలపై వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమా లేదా ఇతర వ్యక్తిగత కారణాలున్నాయా అనే అంశంపై విచారణ జరుగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

AndhraPradeshNews CampusSuicide ChittoorCrime ChittoorNews CollegeHarassment SITAMSEngineeringCollege StudentDeath StudentSuicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.