हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Latest News: Chittoor Court: మేయర్ దంపతుల హత్యకేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

Anusha
Latest News: Chittoor Court: మేయర్ దంపతుల హత్యకేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది. ఈ కేసుపై చిత్తూరు జిల్లా కోర్టు (Chittoor Court) గురువారం నాడు సంచలన తీర్పు ఇచ్చింది. మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌లను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Read Also: Crime: మావోయిస్టు డంపుల్లో 400 కిలోల బంగారం గుట్టు!

చిత్తూరు జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు (Judge Dr. N. Srinivasa Rao) ఈ తీర్పును వెల్లడించారు. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, “ఇది సాధారణ హత్య కాదు. ప్రభుత్వ కార్యాలయంలో నేరుగా దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను సవాలు చేసినట్టే. అందుకే ఈ హత్యను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము” అని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో A1గా చంద్ర శేఖర్ @చింటూ, A2గా వెంకట చలపతి@ ములబాగల్ వెంకటేశ్, Aగా జయ ప్రకాష్ రెడ్డి, A4గా మంజునాథ్, A5గా వెంకటేశ్@ గంగన్న పల్లి వెంకటేశ్ ఉన్నారు. వీరంతా చిత్తూరు జిల్లా జైలులో ఉన్నారు.

పూర్తీ వివరాలు

కఠారి మోహన్, అనురాధ దంపతుల హత్య కేసు తీర్పు ఉండటంతో చిత్తూరు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు.2015 నవంబరు 17న చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్‌ దారుణ హత్యకు గురయ్యారు. బురఖా ధరించి వచ్చిన దుండగులు కత్తులు, తుపాకులతో ఇద్దర్ని దారుణంగా హత్య చేశారు. అనురాధను తుపాకీతో కాల్చి చంపారు..

Chittoor Court

ఇంతలో కాల్పుల శబ్దం విని వచ్చిన ఆమె భర్త కఠారి మోహన్‌‌ (Kathari Mohan) ను కత్తులతో పొడిచి చంపారు. తీవ్రగాయాలైన మోహన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అదేరోజు సాయంత్రం చనిపోయారు. ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి కఠారి మోహన్‌, అనురాధల మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూను ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.

ప్రధాన నిందితుడు చింటూ ఈ హత్యలు చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నానని

ఈ కేసులో మొత్తం 23మందిని అరెస్ట్ చేశారు. ఈ హత్యకేసు విచారణ జరుగుతూ వస్తోంది.ఈ కేసులో ఐదుగురిపై నేరం రుజువు కాగా.. మరో 16మందిపై ఉన్న కేసును కొట్టేస్తున్నట్లు ఈ నెల 24న చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు ఇచ్చారు.

ఆ తర్వాత నిందితుల వాంగ్మూలాలను తీసుకున్నారు. అనంతరం కూడా లాయర్ల వాదనలు కొనసాగాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు చింటూ ఈ హత్యలు చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నానని న్యాయమూర్తి దగ్గర వాపోయాడు.

తనకు క్షమాభిక్ష పెడితే వ్యాపారంతో పాటు సంఘ సేవ చేసుకుంటానన్నాడు. మిగిలిన నిందితులూ కూడా అలాగే వేడుకున్నారు. అయితే ఇటీవల కోర్టు ఐదుగురు నిందితులపై నేరం రుజువైనట్లు తేల్చింది.. ఉరిశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పును ప్రకటించింది. ఈ హత్య జరిగిన దాదాపు పదేళ్ల తర్వాత చిత్తూరు జిల్లా కోర్టు (Chittoor Court) సంచలన తీర్పును వెల్లడించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870