రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు(Chittoor) జిల్లా పర్యటన ఏర్పాట్లను,ఆ ప్రదేశాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, బుదవారం పరిశీలించారు.
24వ తేదీన చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో పాల్గొనడం తో పాటు ప్రజలతో బహిరంగ మీటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు చర్యలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలిసి పరిశీలించారు.
Read Also: Davos WEF 2026: AP కి 40 కంపనీలు.. బాబు మాస్టర్ ప్లాన్
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విచ్చేయు ప్రదేశాలు, సభా ప్రాంగణం, రూట్ మ్యాప్, హెలిప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ఎంట్రీ–ఎగ్జిట్ గేట్లు, బ్యారికేడింగ్, పోలీస్ పాయింట్లు, సభా వేదిక పరిసరాలు, ప్రజల రాకపోకల మార్గాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు(Chittoor) ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేయాలని, వాహనాల పార్కింగ్ కోసం ముందస్తుగా కేటాయించిన ప్రదేశాలలోనే పార్కింగ్ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రద్దీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా రూట్ అంతా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
అలాగే, సభా ప్రాంగణంలో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని, బ్యారికేడింగ్, మెటల్ డిటెక్టర్ చెకింగ్, ఫ్రిస్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణ, డ్యూటీ పాయింట్ల వద్ద సిబ్బంది అప్రమత్తత వంటి అంశాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వీఐపీ రూట్, సభా ప్రాంగణ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు/వాహనాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం , పబ్లిక్ మీటింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలని, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం, ఫైర్ సేఫ్టీ, తాత్కాలిక మరుగుదొడ్లు, ప్రజలకు సూచనల కోసం సైన్‌బోర్డులు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటన సందర్భంలో ప్రజలకు భద్రతతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించడానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందస్తుగా సమీక్షించి, బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా నిఘా తదితర వ్యవస్థలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీస్ అధికారుల బృందం పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: