📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

Chittoor: కోడి పందేలు నిర్వహిస్తే అరెస్టులు ఖాయం: ఎస్పీ తుషార్

Author Icon By Tejaswini Y
Updated: January 13, 2026 • 2:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: “తెలుగుదనాన్నీ లోకమంతా చాటిస్తూ, మన సంప్రదాయాన్ని విశ్వమంతా పరిచయం చేస్తూ, ప్రతి ఇంట్లో ఆనందం నిండాలి” అని, మీ అందరికీ ఈ పండుగ సంపూర్ణ ఆరోగ్యం, శాంతి, ఆనందాలు అందించాలని, సంక్రాంతి వేళ ప్రతి ఇంటా మురిపెంగా హరిత పచ్చని ఆశయాలు నిండాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాననీ చిత్తూరు(Chittoor) జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.

Read Also: Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా?

జిల్లా వ్యాప్తంగా జల్లికట్టు, కోడి పందేలు(cockfighting ban) నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జిల్లాలో ఎక్కడా జల్లికట్టు, కోడి పందేలు నిర్వహించకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పోలీసు అధికారులను ఆదేశించారు. “కోడి పందేలు, జల్లికట్టు వంటి కార్యకలాపాలు చట్ట విరుద్ధమైనవే కాకుండా, మూగ జీవాలపై హింసకు కారణమవుతాయి. ఇలాంటి కార్యక్రమాలకు జిల్లాలో స్థానం లేకుండా చేయాలి” అని ఎస్పీస్పష్టం చేశారు.

కోడిపందేలు, పేకాట, గుండాట(Jallikattu) వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన శిక్షలు తప్పవు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమవుతుందని, యువత తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించారు. పాత నేరస్తులపై ఇప్పటికే నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు.

పోలీసు అధికారులకు సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చిన ఎస్పీ. కోడి పందేలు నివారించేందుకు రెవిన్యూ, జంతు సంక్షేమ శాఖ, ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్‌ఐ, జంతు సంక్షేమ సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, గ్రామాల్లో నిఘా కొనసాగించాలని ఆదేశించారు. “ప్రజలలో అవగాహన పెంచడమే మొదటి అడుగు. ఆటోలలో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం నిర్వహించి, కోడి పందేల చట్టవ్యతిరేకతను వివరించాలి” అని ఎస్పీ పేర్కొన్నారు.

గ్రామ స్థాయిలో సర్పంచులు, గ్రామ పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో కోడి పందేల నివారణపై అవగాహన కల్పించాలని సి.ఐ.లు, ఎస్‌.ఐ.లను ఆదేశించారు. “పికెట్లు ఏర్పాటు చేసి, జల్లికట్టు లేదా కోడి పందేలు జరగకుండా సమర్ధవంతంగా చర్యలు తీసుకోవాలి. ఆచరణలో నిలువరించడంలో అలసత్వానికి తావు ఉండరాదు” అని సంబంధిత డిఎస్పీలను ఆదేశించారు.

కోడి పందేల నిర్వహణపై కఠిన చర్యలు…

“కోడి పందేలు మరియు పేకాట నిర్వహణ వేదికలుగా తమ భూములు లేదా ఇతర స్థలాలను అందుబాటులోకి ఇచ్చే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవు. పందేలు నిర్వహిస్తే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు అనిమల్స్ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేస్తాం. ప్రజలెవరూ కోడి పందేలు, పేకాట మరియు జల్లికట్టు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వకుండా ఉండాలి” అని హితవు పలికారు.

“సంక్రాంతి పండుగ ప్రజలకు ఆనందాన్ని ఇచ్చే పండుగ. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా, కుటుంబ సమేతంగా పండుగను సంతోషంగా జరుపుకోవడమే ఉత్తమం. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై చట్టబద్ధమైన చర్యలు తప్పవు”. ఈ క్రమంలో, కోడి పందేలు, పేకాట, జల్లికట్టు వంటి కార్యక్రమాలపై పటిష్ట నిఘా కొనసాగించి, జిల్లాను చట్టబద్ధతలో ముందుండేలా చేయడమే తమ ముఖ్య లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

జిల్లాలో ఏ ప్రాంతంలోనైనా జల్లికట్టు, పేకాట మరియు కోడి పందేలు జరుగుతున్నా… జరిగే వీలున్నా వెంటనే డయల్ – 112 లేదా జిల్లా పోలీసు వ్యాట్సాప్ నంబర్ 9440900005 కు ఫోన్ లేదా సంక్షిప్త సందేశం రూపంలో చేరవేయవచ్చన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh police Chittoor district Cockfighting Ban gambling ban Jallikattu ban Sankranti message SP Tushar Dudi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.