📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Chittoor: పరేడ్ గ్రౌండ్‌లో ఏఆర్ మొబిలైజేషన్ కార్యక్రమం

Author Icon By Tejaswini Y
Updated: January 19, 2026 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతి సంవత్సరం చిత్తూరు జిల్లా(Chittoor) ఏ.ఆర్ బలగానికి వార్షిక మొబిలైజేషన్ ను నిర్వహించడం ఆనవాయితి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశానుసారం జిల్లా సాయుధ దళం పెరేడ్ గ్రౌండ్, చిత్తూరు లో సోమవారం ఏ ఆర్ పోలీసు సిబ్బంది మరియు అధికారుల కొరకు వార్షిక మోబిలైజేషన్(Mobilization) కార్యక్రమం ను ప్రారంభించినారు. ఈ కార్యక్రమానికి ఏ.ఆర్.అడిషనల్ ఎస్పీ దేవదాస్ ముఖ్య అతిధిగా హాజరై AR అధికారులచే గౌరవ వందనం స్వీకరించారు.

Read also: Vinukonda: ఆర్టీసీ బస్టాండ్‌లో తొక్కిసలాట.. నలుగురికి తీవ్ర గాయాలు..!

Chittoor: AR mobilization program at the parade ground

15 రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ఈ సందర్భంగా ఏ.ఆర్.అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ 15 రోజుల కార్యక్రమంలో ఏ ఆర్ సిబ్బంది , అధికారులు, వంటి అన్ని రకాల నైపుణ్యాలను పునః సమీక్షించి వాటిలో నిష్ణాతులుగా చేయడం జరుగుతుందని, AR బలగము జిల్లా బలగానికి వెన్నుముక్క లాంటిదని, వీరి ఉద్యోగం వైవిధ్యభరితమే కాకుండా కష్టతరమని తెలుపుతూ ఈ 15 రోజుల నైపుణ్య పునఃక్షరణ కార్యక్రమంలో అన్ని రకాల నైపుణ్యాలను పూర్తి క్రమశిక్షణతో నేర్చుకోవాలని, తమ విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో జనరల్ డ్యూటీ చేసే సిబ్బంది తో పాటు మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్, సెక్యూరిటీ వింగ్, గన్ మ్యాన్ లు, డాగ్ స్క్వాడ్, బ్యాండ్ మొదలైన విభాగాలలో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డి.ఎస్పీ మహబూబ్ బాష, ఆర్.ఐ.లు సుధాకర్, చంద్ర శేఖర్, వీరేశ్, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Annual Mobilization Program AR Police Mobilization Armed Reserve Police Chittoor District Police

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.