📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telugu News: Chittoor accident: పవన్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయం

Author Icon By Pooja
Updated: November 10, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చిత్తూరు జిల్లా(Chittoor accident) పర్యటనలో దుర్ఘటన చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఆయన కాన్వాయ్‌ ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ కాలికి తీవ్ర గాయమైంది. వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్‌ ఇవాళ పలమనేరు సమీపంలోని కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు రహదారి ఇరువైపులా గుమిగూడారు. అభిమానుల ఉత్సాహం కారణంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ కిందపడిపోయింది.

Read Also: AP Crime: సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రగ్స్ డాన్ అరెస్ట్

Chittoor accident

ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) కాన్వాయ్‌ అక్కడుగా దూసుకెళ్తుండగా,(Chittoor accident) కిందపడిన మహిళ కాలిపై వాహనం చక్రం దూసుకెళ్లింది. ఆమె నొప్పితో అరిచేయడంతో, సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రోడ్డుపై నుంచి తొలగించారు. అనంతరం బాధితురాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం, ఆమె కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అభిమానుల తాకిడి, భద్రతా లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chittoor Accident convoy mishap Janasena Pawan Kalyan Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.