చింతూరు: ఆంధ్రప్రదేశ్‌లోని మన్యంలో పోలవరం ప్రాజెక్టు(Polavaram project) వివాదం మరోసారి రగులుతోంది. పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా ఈ ఏడాది పంటలు పండించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, నాలుగు నెలల పాటు రహదారులు నీట మునిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ముంపు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో, రోజువారీ కూలీలకు పని దొరకడం లేదు. దీంతో ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాలు గ్రామాలు వదిలిపోతుండగా, పేద, మధ్యతరగతి కుటుంబాలు మాత్రం పరిహారం కోసం ఎదురుచూస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
Read Also: Bunny Vasu: బుక్ మై షో పై బన్నీ వాసు ఫైర్
ఐటీడీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడానికి సుమారు 2 వేల మంది ముంపు గ్రామాల ప్రజలు బుధవారం చింతూరు ఐటీడీఏ (ITDA) కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు కార్యాలయం గేట్లను మూసివేసి ఆందోళనకారులను లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఆందోళనకారులు గేట్లను నెట్టివేసి గ్రీవెన్స్ సెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో ఐటీడీఏ కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
కలెక్టర్‌కు విన్నపం, హామీ
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ మరియు చింతూరు ఐటీడీఏ పీవో శుభం నోక్వాల్ బయటకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బ్యాక్‌వాటర్ కారణంగా వేసిన పంటలు కుళ్ళిపోయాయని, వాణిజ్య పంటలు వేసుకునే సమయం కూడా వెళ్ళిపోయిందని, ఈ ఏడాది పంటలు పండించడం అసాధ్యమని బాధితులు తమ సమస్యను కలెక్టర్‌కు వివరించారు. తమకు పోలవరం పరిహారం త్వరగా ఇచ్చి, గ్రామాలను ఖాళీ చేయించి పునరావాసం కల్పించాలని, పంట నష్ట పరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్, పోలవరం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మాట్లాడి, మొదటి దశగా 41.15 కాంటూర్ ఉన్న వాటికి సర్వే పూర్తి చేసి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
ముంపు గ్రామాల ప్రజలు ఎక్కడ ర్యాలీ నిర్వహించారు?
చింతూరులోని ఐటీడీఏ కార్యాలయం ముందు సుమారు 2 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి?
పోలవరం బ్యాక్‌వాటర్ కారణంగా పంట భూములు నీట మునిగి వ్యవసాయం దెబ్బతినడం, పరిహారం అందకపోవడం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: