📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu News : Children’s Rights : బాలల హక్కుల పరిరక్షణ కాగితాలకే పరిమితం!

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం ప్రతి సంవత్స రం నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుం టారు. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకో వడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యం తో ఈ దినోత్సవం నిర్వహించబడుతున్నది. 1954, డిసెంబరు 14న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1956 నుంచి ప్రపంచ బాలల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం వేడుకగా నిర్వహించాలని అన్ని దేశాలకు సూచించింది. 1959, నవంబరు 20న ఐక్యరాజ్య సమితి జనరల్ శాసనసభ బాలల హక్కుల (Children’s Rights)ప్రకటనను ఆమోదించింది. 1989, నవంబరు 20న బాలల హక్కులపై (Children’s Rights) సంప్రదాయ ఆచరణను ఆమోదించింది. చాలా దేశాలు ఐక్యరాజ్య సమితి జనరల్ శాసనసభ సూచించిన నవంబరు 20న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విధిలేక బాలకార్మికులుగానే ఉండిపోతున్నారు. బాలల శ్రేయ స్సుకు కృషి జరుగుతున్నా ఆచరణలో ఫలితాలు కానరా వడం లేదు. పాఠశాల సౌకర్యాలు లేక కొందరు, అవిఉన్నా వివిధ కారణాల రీత్యా బడికి వెళ్లలేక మరికొందరు బాలలు తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలతో ముడిపడి సంక్షేమ పథకాలకు నోచుకోక, చదువు చెప్పించే స్థోమత లేక ఎందరో పేద తల్లిదండ్రులు గత్యంతరం లేని స్థితిలో చిన్నారులపై భారాన్ని మోపుతున్నారు. హోటళ్లు, కిరాణా దుకాణాలు, ఫ్యాక్టరీలు, మిల్లులు, క్వారీలు, గనులకు తమ పిల్లలను పనికి పంపుతున్నారు. వ్యవసాయ పనులకు కొందరు బాలలు వెళుతున్నారు. చివరికి కొందరు పిల్లలను భిక్షాటన వృత్తిలోకి బలవంతంగా నెడుతున్నారు.

Read Also : http://Minister Rajanarsimha: ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు

Children’s Rights

బాలకార్మికుల అవస్థలు

వివిధ రంగాలలో బాలకార్మికులు అవస్థలు పడుతూ అనుక్షణం శ్రమిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్దలు చేయాల్సిన పనులను సైతం వీరే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు నీళ్లు వదిలి బాలలు చేత వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా, వారికి విముక్తి కలిగించాలన్న ధ్యాస సంబంధిత అధికారుల్లో లేకపోవడం బాధాకరం యజమానులు చెప్పిందే చట్టంగా, వారు చేసేదే సంక్షేమంగా పరిస్థితులున్నా కార్మిక శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అప్పుడ ప్పుడు తూతూ మంత్రంగా దాడులు చేస్తున్నా దోషులకు ఎలాంటి శిక్షలు పడడం లేదు. 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని 24వ నిబంధన స్పష్టం చేస్తున్నా అది కాగితాలకే పరిమితమవడం శోచనీయం. పేదరికం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పసిపిల్లల బంగారు కలలు చెదిరిపోతున్నాయి. పాలబుగ్గల లేత వయసులో వారు కార్మి కులుగా మారడం బాధాకరం. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పిల్లల చేత పనిచేయించుకునే యాజమాన్యాలు తగిన వేత నాలు ఇవ్వడం లేదు. పిల్లలు పనిచేసే చోట తగిన రీతిలో భద్రతా సౌకర్యాలను కల్పించకపోవడం ఆక్షేపణీయం. ప్రాథమిక హక్కులను పేర్కొన్న రాజాంగంలోని 3వ ప్రకరణం లోని 15(8)వ అంశం బాలల కోసం ప్రత్యేక శాసనాలు చేసే అధికారం ప్రభుత్వానికి కలుగజేస్తున్నది. 28వ అధిక రణం ప్రకారం బాలలను వ్యాపార వస్తువుగా మార్చడం, నిర్బంధ సేవలను చేయించుకోవడం అపరాధంగానే పరిగ ణించాలి. 14 సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగారాలలో, గనులలో, ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించ డాన్ని 24వ ఆర్టికల్ నిషేధించింది. 39(ఇ) ప్రకారం బాల లను వారి వయసుకు తగని, శక్తికిమించిన పనులలో నియమించరాదు.

Children’s Rights

పేదరికం

పేదరికాన్ని సాకుగా చేసుకుని బాలలను పను ల్లో నియమించడం నిషేధించాలని రాజ్యాంగంఆదేశించింది. కఠిన చట్టాలు ఎన్నిఉన్నా చాలామంది పిల్లలు బాల కార్మికు లుగానే మిగిలిపోతున్నారు. రాజ్యాంగంలో పేర్కొన్న నిర్బం ధ ప్రాథమిక విద్య ఈనాటికీ ఫలించని కలగానే మిగిలిపో తున్నది. ప్రపంచ బాలకార్మి కుల్లో మూడవ వంతు మంది మన దేశంలోనే ఉన్నారని ఒక అంచనా. దీంతో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. 5 నుండి 15 సంవత్సరాల లోపు వయసుగల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించేందుకు పలు కార్యక్రమాలను చేపట్టారు. పాఠశాలలో నమోదు కాని, మధ్యలో మానివేసిన, అర్హతగల పిల్లల సమగ్ర వివరాలను సేకరించి వారిని తిరిగి తరగతులకు పంపేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఆచరణాత్మక చర్యలను చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుల పండగ పేరుతో 2002 ఆగస్టు 1 నుండి 10వరకూ, 2003 సంవత్సరం నవంబర్ 24నుండి 29వరకూ బడిబయట ఉన్న పిల్లలనం దరినీ పాఠశాలలలో చేర్పించే బృహత్ కార్యక్రమాన్ని అమలుచేశారు. ఆతర్వాత ఏటా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తునే ఉన్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నది వాస్తవం. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెబుతున్నా బాలకార్మికులు వివిధ పనుల్లో కొన సాగుతూనే ఉన్నారు. బాల కార్మికవ్యవస్థను నిర్మూలించడానికి, నిర్బంధ ప్రాథమిక విద్య అమలుకు మరింతగా చర్యలు చేపట్టవలసి ఉంది. ముందుగా వారి తల్లిదండ్రుల కు చదువు పట్ల అవగాహన కలిగించాలి. బాలకార్మికులకు వసతి సైతం కల్పించేలా ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలి. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక సమస్యలను తొల గించేలా వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలి. పిల్లల సంపాదనపై ఆధార పడకుండా తల్లిదండ్రులకు సాధికారత కల్పించాలి.
-రామ కిష్టయ్య సంగన భట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

#telugu News Breaking News Child Protection Child Welfare Children's Rights Human Rights latest news Social issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.