దేశంలో అయినా బాలలే రేపటిపౌరులు. అలాంటి బాలల భవిష్యత్తు పాలకుల విధానంపై ఆధారపడి ఉంది. బాలల పరిస్థితే ఆ దేశపరిస్థితికి, ఆర్థికవిధానాలకు అద్దంపడుతుంది. ప్రపంచజనాభాలో పిల్లలు 25శాతం ఉన్నారు. వీరిలో సుమారు 16.8 కోట్ల మంది బాలకార్మి కులుగా ఉన్నారు. ప్రతి 10 మందిలో ఒకరు ఏదోఒక పని లో నిమగ్నమై ఉన్నారని అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐ ఎల్వో) అంచనా వేసింది. సుమారు 3.6 కోట్లమంది పిల్లలు బానిస బ్రతుకులు గడుపుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన మానవ హక్కుల బృందం దవాక్చీ ఫౌండేషన్ నివేదిక పేర్కొంది. పేదరికం, నిరక్షరాస్యత, అక్రమ రవాణా వంటివాటి వల్ల ఎంతోమంది పిల్లలు బాలకార్మికులు (Child laborers )గా మగ్గి పోతున్నారు. తీవ్రమైన దోపిడీ దౌర్జన్యాలకు గురౌతున్నారు. బాలకార్మిక వ్యవస్థవల్ల విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులు హరించబడుతున్నాయి. లైంగిక, ఆర్థికదోపిడీకి గురౌతున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో 23,68,17,000 మందిపిల్లలున్నారు. వీరిలో 11.45 మంది పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. అంటే ప్రతి వందమంది పిల్లల్లో 11శాతం మంది పాఠశాలకు దూరంగా ఉన్నారు. దీన్నిగణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వశాఖ 8.12.2025 విడుదల చేసింది. అంత ర్జాతీయ కార్మికసంస్థ నివేదిక ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 ఏళ్ల మధ్య
వయస్సు లోని కోటి, ఒకలక్ష మంది పిల్లలు పనుల్లో కొనసాగుతున్నారు. బాల కార్మికశ్రమ శక్తిలో 14 నుంచి 17 సంవత్సరాల పిల్లలు సుమారు 63 శాతం ఉన్నారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థతెలిపింది.
Read Also : Fishermen: బంగ్లాదేశ్ జైలు నుంచి భారత మత్స్యకారుల విడుదల
54 శాతం పెరుగుదల
యూనిసెఫ్ నివే దిక ప్రకారం పట్టణ ప్రాంతంలో 5-14 ఏళ్ల వయస్సులోని బాల కార్మికుల్లో 54 శాతం పెరుగుదల కనిపించింది. భారత దేశరాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వ్యక్తి గౌరవం ఆధారంగా కొత్తసామాజిక వ్యవస్థను స్థాపించాలని, పేదరికం, అజ్ఞానం, అనారోగ్యాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పేర్కొన్నది. 78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో అవి అమలు జరగలేదు. 2025 నాటికి బాలకార్మికులను(Child laborers ) నిర్మూలించాలన్న ఐక్యరాజ్యసమితి లక్ష్యం భారతదేశానికి ఆచరణ సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 52వ నివేదికలో పేర్కొంది. ఆర్టికల్ 24 ప్రకారం 5-17 సంవత్స రాలలోపు బాలబాలికలను ప్రమాదకరమైన పనుల్లో పెట్టు కోరాదు. ఆర్టికల్ 39 ప్రకారం బాలికల ఆరోగ్యపరిరక్షణకు ఆటంకంగా ఉండే పరిస్థితులను తొలగించాలి. ఆర్టికల్ 45 ప్రకారం 6 ఏళ్లలోపు బాల, బాలికల అందరికీ ఉచితవిద్య, సంరక్షణ అందించాలి. జాతీయ బాలలకు అన్నివిధాల రక్షణ, హక్కులను కాపాడాలని కేంద్రమంత్రిత్వశాఖ, బాలకార్మిక చట్టం 1986కు సవరణ చేసింది. దీనిప్రకారం 14 సంవ త్సరాలలోపు పిల్లలను ఎలాంటి పనుల్లో చేర్చగూడదు. వారు బడిలో చదువుకోవాలి. ఇవేవీ అమలు జరగకుండా రాజ్యాంగంలో అలంకారప్రాయంగా ఉన్నాయి. ప్రతి బిడ్డకు సమాన అవకాశాలు, హక్కుల రక్షణ పూర్తి భాగస్వామ్యం గురించి జనవరి1, 1996న చేసిన తీర్మానంతో సహా ఐక్యరాజ్యసమితి అన్ని తీర్మానాలపైనా భారతదేశం సంతకం చేసింది. ఆచరణ మాత్రం సంతకాలకే పరిమితమైంది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు భిన్నంగా భారత బాలల పరిస్థితులున్నాయి. ప్రపంచంలోని పోషకాహార లోపంలో ఉన్న మూడవ బిడ్డ భారతదేశంలో ఉన్నారు. దేశంలోని నలుగురు పిల్లల్లో ముగ్గురు రక్తహీనతతో బాధపడుతు న్నారు. ప్రతి రెండవ బిడ్డ బరువు తక్కువగా ఉన్నాడు.
బ్రతికే అవకాశం తక్కువ
ప్రాథమిక విద్యలోనే చదువుమానేసే పిల్లలు 71.01 ఉన్నారు. దేశం మొత్తంలో 11కోట్ల, 4లక్షల మంది బాల కార్మికులుగా ఉన్నారు. తక్కువ బరువుతో పుట్టినపిల్లలు 44 శాతం ఉన్నారు. 3 సంవత్స రాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో 79 శాతం మందిపిల్లలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. భారతదేశంలో పిల్లల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయి. చాలామంది పిల్లలకు బ్రతికే అవకా శం తక్కువగా ఉంది. వారికి ఆహారం లభించకపోవడమే కాదు, విద్యా అవకాశాలు కూడా లేవు. షెడ్యూల్డ్ కులాలు, తెగలబాలికలలో అక్షరాస్యత రేటు 42 శాతం మాత్రమే. వంద మంది బాలికల్లో 30శాతం మందిమాత్రమే ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. వీరిలో ఇంకా బాల్యవివాహాలు కొన సాగుతూనే ఉన్నాయి. భారతదేశంలో పిల్లల ఎదుగుదల చాలా తక్కువగా ఉంది. ఆర్థికపరిస్థితులే కాకుండా కులం కూడా అవరోధంగా ఉంది. అగ్రకుల పెత్తందారీ, ఆర్థిక సామాజిక తరగతుల పిల్లలతో పోలిస్తే, పేదల అణగారిన తరగతులకు చెందిన చిన్నారుల ఎదుగుదల లోపం అధి కంగా ఉంది. ఆదివాసి దళిత పిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో 35 శాతం మంది ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలే కాదు, సబ్సహరాలోని ఆఫ్రికా దేశాలకన్నాభారతదేశంలోని పిల్లల్లోనే ఎదుగుదల లోపం ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపంతో బాధ పడుతున్న పిల్లల్లో దాదాపు 70శాతం మంది భారత్, ఆఫ్రికాదేశాల్లోనే ఉన్నారు. వీరిలో 35.7 భారత్లో ఉంటే, ఆఫ్రికాలో 33.6 శాతం ఉన్నారు. ప్రభుత్వాలనిర్లక్ష్యపూరిత విధానాలు, పేదరికం, పోషకాహార లోపంవల్ల పిల్లలు ఎదు గుదల సమస్యను ఎదుర్కొంటున్నారని నిపుణుల విశ్లేషణలు చెబుతున్నాయి.
ప్రమాదకరమైన పనుల్లో
బాలకార్మికులుగా ప్రమాదకరమైన పనుల్లో పనిచేయడం వల్ల, పోషకాహార లోపంవల్ల ప్రతిసంవత్సరం భారతదేశంలో లక్షలాది మంది బాలలు చనిపోతున్నారు. 2015లో 5సంవత్సరాలలోపు చిన్నారులు 10 లక్షలకుపైగా మరణించారు. ఇది ఆసంవత్సరంలో ప్రపంచం మొత్తంమీద అత్యధికమని ప్రముఖ లాన్సెట్ పత్రిక తెలిపింది. బడికివెళ్లి ఆటపాటలతో జీవించాల్సిన పిల్లలుబడికి దూరమై బాలకార్మి కులుగా పోషకాహారలోపం వల్ల అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు కారణం వారి కుటుంబాల ఆర్థికపరిస్థితులే కారణం. గతప్రభుత్వాలు ముఖ్యంగా నేటి కేంద్రప్రభుత్వం పేదలకోసం కాకుండా, బడాపెట్టుబడిదారుల, బడాభూస్వాముల, సంపన్న వర్గాల, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసం పనిచేశాయి, చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రభుత్వ దేశ సంపదలను, సహజవనరులను బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది. సెజ్లు, పరిశ్రమలపేరుతో భూములు కూడా వారికికట్టబెడుతున్నది. దేశసంపద, భూములు కొద్దిమంది వద్ద కేంద్రీకృతమై ఉంది. ఫలితంగా గ్రామీణ పేదలు భూమికి దూరంగా, ఉపాధికి దూరంకాగా, పట్టణ పేదలు ఉపాధికి దూరమై పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికం ఫలితంగా బడికి దూరమై కుటుంబ పోషణలో పిల్లలు బాలకార్మికులు గా మారుతున్నారు. ఫ్యాక్టరీల ప్రమాదంలో ప్రాణాలు కోల్పో తున్నారు. పిల్లలు ఈపరిస్థితుల నుంచి బయటపడాలంటే గ్రామీణ పేదలకు భూపంపిణీ జరగాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధిని కల్పించాలి. ప్రజాఅవసరా లను తీర్చే పరిశ్రమలు నెలకొల్పి శ్రామికులకు పనికల్పించి పరిశ్రమల్లో భాగస్వామ్యం ఇవ్వాలి. పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలి. అలాంటి విధానాలను కేంద్రప్రభుత్వం, అమలు చేయదు. దాని వర్గస్వభావం అందుకు వ్యతిరేకం. దాన్ని గ్రహించి పేదలే ఉద్యమం ద్వారా సాధించుకోవాలి.
-బొల్లిముంతసాంబశివరావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: