బానిసత్వ దురాచారం అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తున్నది. డిజిటల్ వెలుగుల నీడన బలవంతపు వెట్టిచాకిరి చీకట్లు కమ్ముకున్నాయి. బానిసత్వం అమానవీయం, మానవహక్కుల హననం. బానిసత్వం ప్రపంచ దేశాలన్నిం టిలో విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల అణగారిన వర్గాల ప్రజలు బలవంతంగా ఆధునిక బానిసత్వసంకెళ్లలో బంధించబడి జీవితాలను కటిక చీకట్లలో గడుపుతున్నారు. వీరిలో 28 మిలియన్లు బలవంతపు శ్రమ, 22 మిలియన్లు బలవంతపు వివాహాల వలయంలో చిక్కుకొని బతుకులు దుర్భరంగా గడుపుతున్నారు. ఒకవ్యక్తి కడు పేదరికాన్ని బలహీనతను ఆసరాగా చేసుకొని అక్రమంగా బలవంతంగా శ్రమకు నియమించుకోవడం, లైంగిక హింసకు గురిచేయడం, బాల్య వివాహాలు చేసుకోవడం, బాల కార్మికులు,(Child labor) యుద్ధ సంక్షోభాల్లో పిల్లల చేతుల్లో ఆయుధాలు పెట్టడం, వెట్టిచాకిరిని ప్రోత్సహించడం, పరిశ్రమల్లో చిట్టి చేతులనుబంధించడం లాంటి దురాచారాలను బానిసత్వ రూపాలుగా చెప్పుకుంటున్నాం. అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం 2025 ఇలాంటి అమానవీయ ఆధునిక బానిసత్వ దురాచారాన్ని రూపుమాపడానికి ఐరాస చొరవ తీసుకొని ప్రతి ఏటా 02 డిసెంబర్ రోజు” అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం (ఇంటర్నేషనల్ డే ఫర్ అబాలిషన్ ఆఫ్స్లేవరీ)’ పాటించడం 2016 నుంచి కొనసాగుతున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బానిసత్వం, బలవంతపు వివాహాలు జరగడం విచారకరం.
Read Also : Jobs: ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు

అంతర్జాతీయ కార్మిక సంస్థ 2021 వివరాల ప్రకారం ప్రపంచ దేశాల్లో28 మిలియన్ల ప్రజలు బానిసత్వ చీకట్లలో మునిగి పోయారని, వీరిలో అధికంగా ఏసియా పసిఫిక్ దేశాలు, యూరోప్ సెంట్రల్ ఏసియా,ఆఫ్రికా, అమెరికా, అరబ్ దేశాల్లో బాని సత్వం విస్తరించుట గమనించారు. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ పనులు, సేవా సంస్థల్లో బానిసత్వ కోరలు అధికంగా వ్యాపించి ఉన్నాయి. దక్షిణాషియా, ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, నేపాల్లో పేదరికం అధికంగా ఉండడం తో బానిసత్వ దురాచారం వేళ్లూనుకొని ఉన్నది. భారత్లో 3 కోట్ల బానిసలు బతుకులు భారంగా ఈడ్చుతున్నారు. భార తంలో బానిసత్వ దురాచారం అనేక రూపాల్లో ఉన్నాయి. ప్రాచీన కాలంలో బానిసల నుదుటిపై కాల్చిన కడ్డీలతో శాశ్వత గుర్తులు కూడా వేసే విషసంస్కృతి అమలైంది. వినని వారిని కొరడాలతో కొట్టడం, చీకటి గదుల్లో బంధించి ఆహారం ఇవ్వకపోవడం కూడా జరిగేది. రుణబంధన వ్యవస్థ, వెట్టిచాకిరి, శ్రమ దోపిడీ,బలవంతపు పెళ్లిళ్లు ఆధునిక బాని సత్వ రూపాలుగా కొనసాగుతున్నాయి. బానిసత్వ దురాచారానికి పేదరికం, కులం, సామాజిక అసమానతలతో విడదీ యరాని సంబంధం ఉంటుంది. ఇటుక బట్టీలో మాడుతున్న బాల్యాలు, బాల్య వివాహ సంకెళ్లు, బాణాసంచా తయారీ కేంద్రాల్లో విష విస్పోటక పదార్థాలతో బాల కార్మికులు,(Child labor) నలిగిపోవడం లాంటివని డిజిటల్యు గంలో కూడా కొనసాగుతున్నాయి. చట్టాలు ఎన్ని ఉన్న బానిసత్వ దురాచారం రెచ్చిపోతూనే ఉన్నది. బానిసత్వ దురాచారం నేర సమానం, ఆక్షేపణీయం. అభివృద్ధి భాషణాలు ఒకవైపు, ఆకలికేకలు మరోవైపు విని పిస్తూనే ఉన్నాయి. బానిసత్వ దురాచారం జడలు విప్పుతూనే ఉన్నది. చట్టాలు కాగితాల్లో పదిలంగానే ఉన్నాయి. వంటిం టిలో చిట్టి బానిసచేతులు బోళ్లు తోముతూనే, బట్టలు ఉతు కుతూనే ఉన్నాయి. బానిసత్వాన్ని బొందపెట్టని ప్రగతి నిరర్థకం. బానిసత్వాన్ని పోషిస్తున్న పౌరసమాజం మానవ విలువలను మంటగలుపుతున్నాయి.
-ఆచార్య బుర్ర మధుసూదన్ రెడ్డి
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: