📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest Telugu news : Child labor system : చిత్తశుద్ధి లేని చట్టాలెందుకు?

Author Icon By Sudha
Updated: October 10, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాల మీద చట్టాలు చేస్తున్నా. కఠిన శిక్షలు తప్పవని ప్రకటనలతో హెచ్చరిస్తున్నా అవేమీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. ఆటపాటలతో, చదువుసంధ్యలతో ఆనందంగా గడపాల్సిన లక్షలాది మంది బాలల జీవితాలు కళ్లముందే బుగ్గి పాలవుతున్నాయి. పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాత చట్టాలకు మరింత పదును పెట్టి పకడ్బందీగా సరికొత్త చట్టాలు తీసుకొచ్చామని నేతలు చెప్పుకుంటున్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక మార్గంలో ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉన్నది. అన్నింటి కంటే ముఖ్యంగా ఏళ్లతరబడి మగ్గుతున్న బాలకార్మికులను ఆ కూపం నుంచి బయటకు తీసుకువచ్చినా వారికి ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకొని నిర్దిష్ట చర్యల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఇది అధికారులందరికి తెలిసిన సత్యమైనా ప్రభుత్వాన్ని నమ్మించేందుకు కాగి తాల మీద ఏదో రాసుకొని కాలం గడుపుతున్నారు. అం దుకే చట్టాలు, శిక్షలు కాగితాలకే పరిమితం కావడంతో బాలకార్మిక వ్యవస్థ నిరాటంకంగా కొనసాగుతున్నది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అప్పటి ప్రధాని జవ హర్లాల్ నెహ్రూ మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు అటు రాష్ట్రపతులందరూ బాలలపట్ల అత్యంత ప్రేమాదరణలు చూపినవారే. ఈ బాలలే భావిభారత పౌరులని, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించి నవారే. ఆ దిశలో ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహించినవారే. అంతెందుకు రాజ్యాంగం లోని ఇరవైనాలుగోవ అధికరణ బాలకార్మిక వ్యవస్థ (Child labor system)ను సమూలంగా వ్యతిరేకిస్తున్నది. పధ్నాలుగు సంవత్సరాల లోపు వయసు గల పిల్లలను, వ్యక్తులుకానీ, సంస్థలు కానీ పనిలో పెట్టుకోకూడదని నిర్దేశిస్తున్నది. రాజ్యాంగం లోని 39(ఇ) అధికరణ కూడా అదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నది. లేత వయసులో ఉన్న పిల్లలను వారి వయసుకు మించిన పనిలో పెట్టకూడదని రాజ్యాంగ నిబంధనలు ఘోషిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ ఆర్థిక అవసరాల నిమిత్తం పిల్లలకు వయసుకు మించిన భారం అప్పగించకూడదని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నది. రాజ్యాంగ నిర్దేశాలు, చట్టాలున్నా అంతగా ఫలితం లేక పోవడంతో బాలకార్మిక వ్యవస్థలో మార్పులు రాకపోగా మరింత పెరుగుతుండడంతో 1986లో పదమూడు వృత్తులకు సంబంధించి యాభైఏడు రకాల పనులను పిల్లలతో చేయించకూడదని మరొక చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టాలకు విరుద్ధంగా బాలకార్మికులను పనిలో నియమించుకునేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఆశించిన ఫలితాలు చేకూరలేదు. 1994లో ఈ విషయంలో ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అప్పటి ప్రధాని పటిష్టమైన చర్యలకు ఆదేశించారు. రెండువేల నాటికి బాలకార్మిక వ్యవస్థ ను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. అది కూడా కాగితాలకే పరిమితమైంది. రోజురోజుకు పెరిగిపోతున్న బాలకార్మిక సంఖ్యను, పరిస్థితులను చూసి ఆందోళన చెందిన దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించింది. దీంతో ఉన్న చట్టాలతో బాలకార్మిక వ్యవస్థను Child labor system) నిర్మూలించడం సాధ్యం కాదని, భావించిన కేంద్ర ప్రభుత్వం ఆ యేడాది అక్టోబరు పదిన కొత్త చట్టా నికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఇళ్లలో పనిచేస్తున్న లక్షలాది మంది బాలకార్మికుల భవిష్యత్కు భరోసా కల్పిం చి, వారికి అక్షరాలు నేర్పించి చైతన్యవంతులను చేయాలనే దిశలో నడుం బిగించింది. పెద్దఎత్తునే హడావుడి చేశారు.ముఖ్యంగా బాలకార్మికులను నిబంధనలకు విరుద్ధంగా నియమించుకునేవారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుశిక్ష విధించేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఇళ్లలో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న బాలకార్మికులను బయటకు తీసుకువచ్చి వారికి విముక్తి కల్పిస్తున్నట్లు ప్రక టనలు చేశారు. అంతవరకు బాగానే ఉంది. కానీ వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు. దీంతో ఆ పిల్లలు తిరిగి పాతబాటే మేలని భావించి ఆవైపే మొగ్గుచూపారు. తల్లిదండ్రుల్లో కూడా ప్రభుత్వం కల్పించే పునరావాస కార్యక్రమాల మీద నమ్మకం కలగలేదు. ఇటు చదువు రాక, అటు పనిరాక, రెంటికి చెడ్డరేవడిలాతయారై మరో మార్గంలో ప్రయాణిస్తారనే భయాందోళనలకు గుర య్యారు. దీంతో వారు కూడా పాతమార్గంవైపే మొగ్గు చూపారు. దీనికితోడు కరోనా రక్కసి సృష్టించిన బీభ త్సంతో లక్షలాది మంది బాలకార్మికులు పాతబాటవైపే నడవడం ప్రారంభించారు. లేతవయసులో చదువు సంధ్యలతో ఆడుతూ పాడుతూ కళ్లముందు ఉండాల్సిన పిల్లలు ఎక్కడో కన్పించని ప్రాంతాలకు పనికోసం పంపుతున్న ఆ తల్లిదండ్రులు ఎంతటి మానసిక క్షోభకు గుర వుతుంటారో ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించాలి. ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను మనస్ఫూర్తిగా అలాంటి పనులకు ఆ వయసులో పంపరనేది వాస్తవం. అయినా పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డను కేవలం డబ్బుకోసమే పరాయిపంచకు పంపడానికి కారణం వారి ఆర్థిక పరిస్థితే నన్నది నగ్నసత్యం. ఆ పిల్లలు చేయలేని, చేయరాని పనులెన్నో చేస్తూ మరెన్నో బాధలు అనుభవిస్తున్నారన్న విషయం ఆ తల్లిదండ్రులకు తెలియంది కాదు. అటు తల్లిదండ్రులకు, ఇటు తమకు ఇష్టంలేని ఆవ్యవస్థలోకి పిల్లలు బలవంతంగా ప్రవేశిస్తున్నారు. అందుకు కేవలం ఆ కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న దరిద్రమే ఏకైక కారణం. ఆ కోణంలో ఆలోచిస్తే కొంతవరకైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :https://epaper.vaartha.com/

Read Also:

Breaking News child exploitation child labor child rights ineffective laws labor law enforcement latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.