Chicken Price Hike: తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అంటేనే మాంసాహార ప్రియులకు పండగ. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చికెన్ ముక్క నోటికి అందడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. కేవలం ఒక్క రోజులోనే ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ధరల పెరుగుదల రికార్డు స్థాయిలో ఉంది.నిన్నటి వరకు సాధారణంగా ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడం గమనార్హం. ఏపీలో ఒక్క రోజులోనే కిలోపై దాదాపు రూ. 70 అదనంగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also: APSPDCL: విద్యుత్ పంపిణి సంస్థల్లో అక్రమాలు, అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి

Chicken Price Hike: ధరలు పెరగడానికి కారణాలు
విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400 వరకు పలుకుతోంది. హైదరాబాద్ లో కిలో చికెన్ రూ. 340 నుండి రూ. 350 మధ్య విక్రయిస్తున్నారు. అసలు దీని ధర అడిగితేనే గుండె జారిపోయేలా ఉంది. కిలో నాటుకోడి ఏకంగా రూ. 800 పలుకుతోంది. అంటే దాదాపు మటన్ ధరతో పోటీ పడుతోంది.వ్యాపారులు,
పౌల్ట్రీ రైతుల విశ్లేషణ ప్రకారం ఈ పెరుగుదల వెనుక ఐదు కీలక కారణాలు ఉన్నాయి. తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో మార్కెట్లోకి రావాల్సిన సప్లై గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రంజాన్ పండుగ కావడంతో చికెన్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ రెట్టింపయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: