📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AI: ఏఐ కమాండ్ కంట్రోల్ తో ఇబ్బందులకు చెక్: టీటీడీ

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, వారి సౌకర్యం, భద్రత, రద్దీ నిర్వహణలో ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరమని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో, టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఏఐ (Artificial Intelligence) ఆధారిత సిస్టమ్‌ను తిరుమలలో భక్తుల కోసం ప్రవేశపెట్టబోతోంది. ఈ సాంకేతికత ద్వారా దర్శనానికి వచ్చే వేలాది భక్తుల సౌకర్యార్తం కోసం,చర్యలు చేపడతారు.

ఏఐ టెక్నాలజీ పై ముందు నుంచి ఫోకస్ చేసిన టీటీడీ చైర్మన్ ఎన్ఆర్ఐ (NRI) ల సహకారంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటులో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

గురువారం ఉదయం సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు

దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది టీటీడీ. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను పరిశిలిస్తే.. ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి.

AI

వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి (Alipiri) వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు.. ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు, సర్వదర్శనం పరిస్థితి లాంటి అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.ఇక ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా ఏఐ భక్తులను గుర్తిస్తుంది.

ఇతర అవాంచనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది

చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికలు ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసు కుంటుంది. క్యూలైన్లు. వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్ (3D map) లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు వాటి చర్యలకు సంకేతాలిస్తుంది.

ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను కూడా ఇది అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను కూడా ఇది చూపుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AI integrated command control center AI technology Breaking News Crowd Management ICCC latest news Srivari Darshan Telugu News tirumala TTD Vaikunta queue complex

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.