నటి సౌమ్యశెట్టి (Soumya Shetty) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె పేరు ఒక మోసం కేసులో ప్రస్తావనకు రావడంతో వివాదం మళ్లీ చెలరేగింది. విశాఖపట్నంలో ఆమెపై తెలంగాణకు చెందిన వ్యక్తి పోలీస్ ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లా (Mahabubnagar District) కోయిల్‌కొండ మండలం అయ్యవారిపల్లెకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, ఈ నెల 11న విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు సమర్పించారు. తనను నటి సౌమ్యశెట్టి సోషల్ మీడియా ద్వారా మోసం చేసిందని, రూ.86 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Read Also: AP: డిజిపి నిద్రపోతున్నారా? రాష్ట్ర పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
లక్ష్మీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఈ ఏడాది మార్చిలో తనకు సౌమ్యశెట్టి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆమెతో చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా స్నేహం పెరిగింది.ఈ ఏడాది మార్చి 29న లక్ష్మీకాంత్ సౌమ్యశెట్టి (Soumya Shetty) కోసం విశాఖపట్నం వచ్చారు. ఈ ఇద్దరు భీమిలి సమీపంలోని ఒక రిసార్టులో కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
లక్ష్మీకాంత్ రెడ్డి (Lakshmikanth Reddy) ఆమెకు రూ.45 వేలు డబ్బులు, ఆరు గ్రాముల బంగారం కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు. సౌమ్యశెట్టికి బంగారం, డబ్బులు, ఫ్లాట్ కొనుగోలు కోసం దశల వారీగా దాదాపు రూ.86 లక్షలు వరకూ ఇచ్చానంటున్నారు.
ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా తిరస్కరించిందన్నారు
అయితే కొంతకాలం తర్వాత సౌమ్యశెట్టి తనను దూరంపెట్టిందని.. దీనిపై తన స్నేహితుడి ద్వారా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా తిరస్కరించిందన్నారు.సౌమ్యశెట్టి భర్త, తల్లి కూడా తనను మోసం చేయడంలో సహకరించారని ఆరోపించారు. ఈ ముగ్గురిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం (Visakhapatnam) సీపీ శంఖబ్రత బాగ్చికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన సీపీ శంఖబ్రతబాగ్చి ఫిర్యా దుదారుడి చెబుతున్నదాంట్లో వాస్తవమెంతో విచారణ చేయాలని భీమిలి సీఐ (Bhimili CI) తిరుమలరావును పెందుర్తి పోలీసులను ఆదేశించారు. అయితే గతంలో కూడా సౌమ్య శెట్టి వివాదంలో చిక్కుకున్నారు.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఓ యువతి ఇంట్లో బంగారం చోరీ చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: