వాటర్డ్ మహోత్సవ్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు : వర్షపు నీటిని ఒడిసి పడదాం..(Chandrasekhar) జీవనా ధారం పెంచుదాం అని కేంద్ర కమ్యూని కేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపు నిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవై రెండు రోజుల జాతీయ సదస్సు గుంటూరులోని ఓ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో మూడవ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మంచి విజన్ తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకుని దేశంలోనే ఆదర్శంగా ఉండాలని, ముందు వరసలో నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి మన రాష్ట్రం, మన ప్రాంతం నుండి మంచి భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. జులై నుండి సెప్టెంబర్ వరకు మంచి వర్షాలు కురుస్తాయని, ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టి అభివృద్ధికి, జీవనోపాధికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 1700 క్యూబిక్ మీటర్ల నీటి అవసరం ఉందని గుర్తించడం జరిగిందని, అంతకంటే తక్కువ నీరు ఉంటే నీటి కొరతగా పరిగ ణించడం జరుగుతుందని అన్నారు. నీటి భద్రత జాతీయ భద్రతగా ప్రధాని పరిగణిస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను వాటర్ షెడ్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు.
Read also:పోలీసుల తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆగ్రహం
ప్రతి గ్రామంలో నీటి అవగాహన కార్యక్రమాలపై దృష్టి
నీటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల వివిధ రంగాల్లో ఆరు రెట్ల ఉత్పాదకత సాధించవచ్చని చెప్పారు. రెండు, మూడు పంటలు వేసుకునే అవకాశం ఉందని, భూగర్భ జలాలు కనీసం మూడు మీటర్ల పెరుగుదల ఉంటుందని అన్నారు. 2021 నుంచి 26 సంవత్సరం వరకు వాటర్ షెడ్ 2.0ను రూ.13 వేల కోట్లతో అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సమీకృత విధానంలో చేపట్టుటకు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఇందుకు మేథోమదనం జరగాల్సిన అవసరం ఉందని వివరించారు. శాఖల మధ్య సమన్వయం. సహకారం అవసరమని, అలా కాకపోతే అమలులో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రజలకు, సమాజానికి అవగాహన లేకపోవడం వలన ప్రయోజనాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన పనులు నిర్వహణ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవలసిన అవసరాన్ని గుర్తుచేశారు. వాటర్ షెడ్ పథకాల అమలు ప్రాధాన్యతను నొక్కి చెపుతూ కరువు తాండవించే ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత అవసరం అన్నారు. ప్రతి ఏడాది కనీసం 25 వేల వరకు చెరువులు పునఃనిర్మాణం చేయుట వరకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం, సమన్వయం, అవగాహనతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని, జీవనోపాధులకు బాటలు వేయ వచ్చని అన్నారు. వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ మహోత్సవ్ లో భాగంగా అమృత్ సరోవర్ క్రింద 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును ఆహ్లాదకరంగా తయారు చేయడమే కాకుండా. చుట్టూ చక్కటి ఉద్యాన వనంగా తీర్చిదిద్దడం జరి గిందని, చిన్నారులకు క్రీడా పరికరాలను, యోగ, వ్యాయామం చేయుటకు అనుగుణంగా పనులను చేపట్టామని, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం
కేంద్ర ప్రభుత్వ(Chandrasekhar) భూ సంస్కరణల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి మాట్లాడుతూ ప్రభుత్వం దేశంలో నలుమూలలకు నీటి వసతులు కల్పనకు వాటర్ షెడ్ ద్వారా నిధులు సమకూర్చుతుంద న్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు త్వరగా మంచి పనులు పూర్తి చేస్తున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ నీటి వసతులను పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎన్స్యూరింగ్ వాటర్ సెక్యూరిటీ, నర్చరింగ్ వేస్ట్ లాండ్, ఎంపవరింగ్ రూరల్ లైవ్లి హుడ్స్ రాజస్థాన్ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, కేంద్ర గ్రామీణ అభి వృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: