📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Chandrababu: పోర్టులు, రైల్వేల కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి

Author Icon By Sushmitha
Updated: October 16, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రధాని పర్యటన విజయవంతం చేయాలి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సూచించారు. ఈ పర్యటనపై ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. “డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలున్నాయి. ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనలను విజయవంతం చేద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని, గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు. విభజనతో ఎదురైన ఇబ్బందుల కంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Read Also: Crime: కోనసీమలో దారుణం..ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

గూగుల్ ఏఐ హబ్‌, జీఎస్టీ ఉత్సవ్

రాష్ట్రంలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు కోసం ఢిల్లీలో మంగళవారం ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని సీఎం తెలిపారు. రూ. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చిందని, ఇది దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని అన్నారు. ఈ హబ్ రావడంలో మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రధాన పాత్ర పోషించారని కొనియాడారు. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్స్ కార్యక్రమాలను విజయవంతం చేసినట్లుగా, గురువారం జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.

రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం

రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువస్తున్నామని, సీమ జిల్లాలు ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారాయని సీఎం చంద్రబాబు వివరించారు. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు కనీసం రూ. 2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. రాయలసీమను టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ’ సాధనే లక్ష్యంగా అందరూ పని చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ప్రధాని మోదీ ఏఏ ప్రాంతాల్లో పర్యటించనున్నారు?

ప్రధాని మోదీ శ్రీశైలం మరియు కర్నూలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

గూగుల్ ఏఐ డేటా హబ్‌లో పెట్టుబడి ఎంత?

గూగుల్ సంస్థ రూ. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

AP Development Chandrababu Naidu Google AI Hub Google News in Telugu GST Utsav Latest News in Telugu PM Modi Rayalaseema tourism. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.