📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Breaking News – CMEGP Scheme : యువత కోసం CMEGP పథకాన్ని తీసుకరాబోతున్న చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: November 7, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా “CM ఉపాధి కల్పన (Chief Minister’s Employment Generation Programme – CMEGP)” పేరుతో ఒక కీలక పథకాన్ని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించి, గ్రామీణ ప్రాంత యువతకు ఆర్థిక స్థిరత్వం కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. తాజా సమాచారం ప్రకారం, ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.300 కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం నుంచే దీనిని అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.

News Telugu: Agra: అద్దెకు తాతా..బామ్మా.. సర్వీసు

సర్కారు వర్గాల సమాచారం ప్రకారం, ఈ పథకం కింద గ్రామీణ యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవా రంగంలో రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణ సాయం అందించగా, తయారీ రంగంలో రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రుణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో బ్యాంకుల ద్వారా సబ్సిడీతో అందించే అవకాశం ఉంది. అంతేకాకుండా, శిక్షణా కార్యక్రమాలు, ప్రాజెక్ట్ ప్లానింగ్, వ్యాపార నిర్వహణ వంటి అంశాలలో కూడా మార్గదర్శకత్వం అందించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పుట్టుక తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, పట్టణాలకు వలసలు తగ్గే అవకాశం ఉంది. ఈ నెల 10న జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో “CM ఉపాధి కల్పన” పథకంపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. పథకం ఆమోదం పొందిన వెంటనే దాని మార్గదర్శకాలను విడుదల చేసి, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం విజయవంతమైతే, రాష్ట్ర యువతకు స్వయం ఉపాధి దిశగా ఇది గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Ap Chandrababu CMEGP Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.