📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu: మహిళలని అవమానిస్తే క్షమించే ప్రసక్తే లేదు :సీఎం చంద్రబాబు

Author Icon By Sharanya
Updated: June 8, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ ఛానల్‌ లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కాక, ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్న యజమానత్వంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని గురించి, అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ‘వేశ్యలు’ అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషించాలి. కానీ, “వేశ్యలు” అనే దారుణ పదం అమరావతి (Amaravati) ప్రాంత మహిళల గురించి మాట్లాడటమంటే అది మీడియా ముసుగులో ఒక దురుద్దేశపూరితమైన చిత్తశుద్ధిలేని కుట్రకు సంకేతమని చంద్రబాబు అన్నారు.

“స్త్రీలకు గౌరవం ఇవ్వాలి – ఇది మన సంస్కృతి”

చంద్రబాబు తన ప్రకటనలో భారతీయ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం. మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం.

మౌనంగా ఉండడం కూడా నేరమే

తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై కనీసం ఒక క్షమాపణ కూడా చెప్పకపోవడం దురదృష్టకరం అని అన్నారు.

కఠిన చర్యల హెచ్చరిక

ఇలాంటి దుర్మార్గపు సంస్కృతి ఇక సహించబోదు అని హెచ్చరించిన చంద్రబాబు వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది సుస్ఫష్టం.రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వం పై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశ్యపూర్వకంగా, నీచాతినీచంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్నే అవమానించడం. మహిళలను గౌరవించే, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచే కూటమి ప్రభుత్వం ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.

మహిళా సంఘాలు, న్యాయవాదుల స్పందన

ఇతర నేతలు, మహిళా సంఘాలు, న్యాయవాదులు కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. “ఇది జర్నలిజం కాదు, ఇది మహిళల ఆత్మగౌరవంపై విరుచుకుపడే రాక్షస సంస్కృతి” అని పలువురు మహిళా నేతలు అభిప్రాయపడ్డారు.

Read also: Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Maganti Gopinath: మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

#AmaravatiWomen #APPolitics #ChandrababuNaidu #JournalismEthics #SakshiTVControversy #WomenRespect Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.