Chandrababu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

Read Time:  1 min
Chandrababu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
FONT SIZE
GET APP

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు (Chandrababu) ఆహ్వానం అందింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేశ్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని (Amaravati) సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

Read Also: SSC Board: టెన్త్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు

Chandrababu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
The Chief Minister has been invited to the Maha Shivaratri Brahmotsavams at Srisailam.

ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు (Chandrababu) బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే, ఆలయ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.

దీనిపై స్పందించిన సీఎం, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, రవాణా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇదే క్రమంలో, నంద్యాల జిల్లాలోని మహానంది క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా హాజరుకావాలని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబును ఆహ్వానించారు.

Chandrababu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.