📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: Chandrababu: పార్వతీపురం పీటీఎంలో సీఎం విద్యా మార్పులకు నాంది

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్వతీపురం మన్యం జిల్లాలోని భామిని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ‘మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)’ సందడిగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు(Chandrababu), రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రెండు కీలక విద్యా కార్యక్రమాలను ప్రారంభించారు. విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) తో కలిసి ఆయన ‘గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్)’ మరియు ‘క్లిక్కర్’ విధానాలను అధికారికంగా ప్రారంభించారు.

Read also: TTD: జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

విద్యార్థులు–తల్లిదండ్రులతో సీఎం సంభాషణ

కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ యాప్ పనితీరును మంత్రి లోకేశ్‌ సీఎంకు వివరించారు. యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి, ప్రోగ్రెస్ రిపోర్టులను సీఎం పరిశీలించారు. అనంతరం తరగతి గదిలో జరిగిన వీడియో ప్రదర్శనలో ‘క్లిక్కర్’ విధానం ద్వారా విద్యార్థుల నేర్చుకునే శక్తిని అంచనా వేశారు. ఈ విధానం కోసం 2,300 వీడియోలు సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

The beginning of CM’s educational changes in Parvathypuram PTM

అదేవిధంగా సీఎం, మంత్రి లోకేశ్‌ స్కిల్ అండ్ లెర్నింగ్ ల్యాబ్(Learning Lab), స్పోర్ట్స్ రూమ్, స్టెమ్ ల్యాబ్‌లను సందర్శించి విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. 9వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ పాఠశాల పనితీరు, మధ్యాహ్న భోజన నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఆత్మరక్షణ, నైతిక విలువలు – ప్రత్యేక ప్రదర్శనలు

ప్రధానోపాధ్యాయులు జి. బాబురావు పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. 6వ తరగతి విద్యార్థి కేదార్ సాయి నైతిక విలువలపై చెప్పిన పద్యాలు ఆకట్టుకున్నాయి. స్వచ్ఛత, ఆరోగ్య జాగ్రత్తలు, బాల్య వివాహాలపై ఇంటర్ విద్యార్థిని శోభారాణి ప్రసంగం అందరినీ చైతన్యపరిచింది. బాలికల ఆత్మరక్షణపై 6 నుండి 12వ తరగతి విద్యార్థినులు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి లోకేశ్‌ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

AP Education Reforms AP PTM Meeting Bhamini Model School Clicker Method CM chandrababu FLN Program Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.