📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mahanadu : పీకలు కోసినా.. పార్టీ జెండా మాత్రం వదల్లేదు – చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: May 27, 2025 • 7:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగుదేశం పార్టీ (TDP) మాత్రమే మహానాడు (Mahanadu) వంటి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలపై చర్చించే పార్టీగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కడప మహానాడు వేదికగా ఆయన మాట్లాడుతూ, గతంలో తిరుపతిలో జరిగే మహానాడు, ఈసారి దేవుడి గడప అయిన కడపలో జరగడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 34 మహానాడ్లు నిర్వహించగా, రెండు డిజిటల్ రూపంలో జరిగాయన్నారు. రాయలసీమ ప్రజల తీర్పును గౌరవిస్తూ కడపలో మహానాడును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్డీయే కూటమిలో 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందని తెలిపారు.

త్యాగాలు – విజయానికి పునాది

రాయలసీమలో పదికి పది స్థానాల కోసం మరింత కృషి చేయాలని పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథం నుంచి తన వస్తున్నా పాదయాత్ర వరకు, తాజాగా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర వరకు, టీడీపీ కార్యకర్తలు త్యాగాలతో నిలబడిన చరిత్రను గుర్తు చేశారు. టీడీపీని అణచివేయాలన్న కుట్రలకు పని చేయకుండానే, అక్రమ అరెస్టులు, కేసులకు భయపడకుండా జెండా మోసిన కార్యకర్తలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు. “మన చంద్రయ్య పీక కోసినా జై తెలుగుదేశం అన్నాడు” అని ఉదహరిస్తూ, అలాంటి చైతన్యం ప్రతి కార్యకర్తలో ఉండాలని చెప్పారు.

అభివృద్ధి అంటే టీడీపీ – చరిత్రలో శాశ్వత ముద్ర

తెలుగుజాతి అభివృద్ధికి, సంక్షేమానికి చిరునామా టీడీపీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, మహిళలకు ఆస్తిలో హక్కు, బాలికల విద్య ప్రోత్సాహం, మిగులు విద్యుత్, రూ.2 బియ్యం, పక్కా ఇళ్లు, రూ.4000 పెన్షన్, నిరుద్యోగులకు ఐటీ ఉద్యోగాలు, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అనేక రంగాల్లో టీడీపీ చేసిన కృషిని గుర్తు చేశారు. “తెలుగుదేశం పార్టీ ముందు – తర్వాత అన్న చరిత్ర రాష్ట్రానికి ఉందని గర్వంగా చెప్పగలుగుతాం” అని పేర్కొన్నారు. అభివృద్ధి అజెండాతో ముందుకు సాగే ఈ పార్టీ ప్రజల ఆశలకి మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.

Read Also : Mahanadu : తెలుగుప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు – లోకేష్

Chandrababu chandrababu speech Google News in Telugu Mahanadu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.