ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పర్యావరణ పరిరక్షణపై గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ‘ప్రకృతి అంటే ఏ ఒక్కరి సొత్తు కాదని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని‘ ఆయన స్పష్టం చేశారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఆయన ట్విట్టర్ (‘ఎక్స్’) వేదికగా కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
అడవులు, జలవనరుల సంరక్షణ – ప్రభుత్వ కర్తవ్యం
చంద్రబాబు పేర్కొన్నట్లుగా అడవులను కాపాడుకోవడం, జలవనరులను పరిరక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత. అడవులను కాపాడుకోవాలి. జలవనరులను సంరక్షించుకోవడం మన కర్తవ్యం. అందుకే ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.
స్వచ్ఛాంధ్ర మిషన్ – ఆరోగ్యవంతమైన పర్యావరణ లక్ష్యంగా
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేడు ఒక్కరోజే ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి. మంచి పరిసరాలు ఉంటేనే మంచి ఆరోగ్యం ఉంటుంది. అందుకే స్వచ్ఛ భారత్‌లో భాగంగా మనం స్వఛ్చాంధ్ర కార్యక్రమం చేపట్టాం. చెత్తను ఇంధనంగా మారుస్తూ ప్రకృతిని కాపాడుతున్నాం.
ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన – ఈ ఏడాది థీమ్
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలన” అని గుర్తు చేశారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడానికి మన వంతు బాధ్యతగా పని చేద్దాం. పర్యావరణ పరిరక్షణకు సంకల్పం తీసుకుందాం” అని చంద్రబాబు ‘ఎక్స్’ లో రాసుకొచ్చారు. కాగా, ఈరోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. భారీగా మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో పౌరులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
Read also: Ambati Rambabu: అంబటి రాంబాబు పై కేసు నమోదు
Venigandla Ramu: చంద్రబాబుపై సవాలు విసిరిన నాని ఎక్కడ?..గుడివాడ ఎమ్మెల్యే