తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం రాయలచెరువుకు గండిపడడంతో భారీ వరద ముంచెత్తింది. చెరువు నీరు పొంగిపొర్లడంతో ఐదు గ్రామాలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి సీఎం చంద్రబాబు(Chandrababu) ఆదేశాలతో అధికారులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు.
సహాయక చర్యల్లో 600 మంది సిబ్బంది
కళత్తూరు గ్రామంలో పారిశుద్ధ్య పనులు, బురద తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చర్యల్లో 600 మంది సిబ్బంది, 5 అగ్నిమాపక వాహనాలు, అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల నుంచి వచ్చిన 350 పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతి ఇంటికి ఐదుగురు సిబ్బందిని కేటాయించి, అడుగున్నర మేర పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు.
Read Also: Montha Effect: ఏపీలో 1.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం
విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా
Chandrababu: వరద వల్ల 100 విద్యుత్ స్తంభాలు, 50 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది ఇప్పటికే 90 శాతం పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో తడి ఇళ్లు ఉండటంతో విద్యుత్ సరఫరా మరో రెండు రోజుల తర్వాత పూర్తిగా పునరుద్ధరించనున్నారు.
బాధితులకు ఆర్థిక సాయం, పునరావాసం
తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ స్వయంగా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. స్థానిక పాఠశాలలో పునరావాసం కల్పించి ఆహారం అందించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేల సాయం, తక్షణ సాయంగా రూ.3 వేల నగదు అందజేశారు. పశువులను కోల్పోయిన వారికి మేక, గొర్రెకు రూ.7,500, ఆవుకు రూ.40 వేల, గేదెకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
స్వయం ఉపాధికి చేయూత
ప్రభుత్వం బాధిత గ్రామాల్లో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించేందుకు చేయూత అందించనుంది. ఈ చర్యలతో గ్రామాల్లో సాధారణ జీవనాన్ని త్వరగా పునరుద్ధరించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: