📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

News Telugu: Chandrababu: ధాన్యం కొనుగోళ్లు సంతృప్తికరం.. 32 శాతం పెరిగిన సేకరణ

Author Icon By Rajitha
Updated: December 11, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు 32శాతం పెరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో ఇప్పటివరకు 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు ఈసమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాల్లో 7.89 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు రూ.4,085 కోట్లు చెల్లించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. వేగంగా చెల్లింపులు జరపడంపై సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఆధునిక సాగు యంత్ర పరికరాల కోసం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సాగు వ్యయం తగ్గేలా ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖకు సిఎం దిశానిర్దేశం చేశారు. శాస్త్రీయ విధా నంలో పంటల సాగు ప్రణాళిక, వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు, డ్రోన్ల వినియోగం ద్వారా సాగు వ్యయం తగ్గించాలని తద్వారా రైతులకు (formers) ప్రయోజనం కలిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Read also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

Paddy procurement is satisfactory

32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు

ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం కొనుగోళ్లతో పాటు వివిధ పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు, వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి పెట్టేలా అవగాహన కల్పించాలని సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్య మంత్రికి వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 32 శాతం అధికంగా కొనుగోళ్లు జరిగినట్టు తెలియచేశారు. దీనిపై స్పందించిన సిఎం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎన్డీఎ ప్రజాప్రతినిధులు అంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలబడాలని సూచించారు. రబీ సీజన్లో ప్రజలు తినే వెరైటీ వరి సాగుతో పాటు వాటి కొనుగోలు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ పై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రాగులు, జొన్న, సజ్జ లాంటి చిరు ధాన్యాల పంటలను సేకరించి వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు.

రైతులకు ధర దక్కేలా చూడాలని

రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లకు సంబంధించిన స్లాట్లు కేటాయింపు, ఇతర సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి పత్తి కొనుగోళ్లలో సమస్యల్ని సృష్టించొద్దని సిసిఐకి సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. మిర్చి లాంటి పంటలకు మార్కెట్ కల్పించే విషయంలో వివిధ విశ్లేషణా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 45,420 హెక్టార్లలో సుబాబుల్ సాగైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మార్కెట్ కు అనుగుణంగా సుబాబుల్ రైతులకు ధర దక్కేలా చూడాలని సిఎం సూచనలు జారీ చేశారు. అరటి, నిమ్మ లాంటి ఉద్యాన పంటలకు సంబంధించి కొనుగోలు దారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కనీస మద్దతు ధర దక్కేలా వాణిజ్య పంటల హార్వెస్టింగ్ ప్రక్రియలో రేషనలైజేషన్ విధానాన్ని పాటించాలని.. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతులకు రవాణా ఖర్చులు తగ్గించి అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను అనుసంధానించాలని సిఎం సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

agriculture Andhra Pradesh Farmers latest news paddy procurement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.