📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Chandrababu Naidu: ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొడతాం

Author Icon By Rajitha
Updated: February 5, 2026 • 11:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి లడ్డూ, రాజ్యసభసీట్ల కేటాయింపుపై సిఎం చంద్రబాబు, డిసిఎం పవన్ చర్చలు

విజయవాడ : ప్రత్యర్థి రాజకీయ పక్షాల కుట్రల సమర్థవంతంగా తిప్పకొట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం సమిష్టిగా ఉండాలని ఇద్దరు అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కుల రాజకీయాలను రెచ్చగొట్టే దిశలో వైకాంగ్రెస్పార్టీ కుట్రలు పన్నుతుందని సీఎం.డి సీఎం అభిప్రాయపడ్డారు. వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. ప్రతి అంశానికి కులాన్ని ముడిపెట్టే ప్రయత్నం సహింవచేదిగా లేదని డిప్యూటీ సీఎం పవన్ సమావేశంలో వ్యాఖ్యానించారంటున్నారు. అదీ నిజమైన ఏ అంశంపైనైనా విధానపరంగా వ్యవహరిద్దామని ఆయన సీఎంతో అన్నారు.

Read also: Minister Atchannaidu: జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

We will thwart the conspiracies of our opponents.

ఇది అత్యంత పరిపక్వమైన ఆలోచన అని సీఎం చంద్రబాబు పవన్ కల్యాణ్కు కితాబు ఇచ్చినట్లు సమాచారం. సీఎంగా, కూటమి రథసారధిగా చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి జనసేన మద్దతు ఉంటుందని పవన్ సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఈరోజు (బుధవారం) ఉదయం సీఎం. నివాసానికి చేరుకున్నారు పవన్, అనంతరం ఇద్దరి మధ్య సమావేశం మొదలైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలపై విపక్షం రెచ్చగొట్టే ప్రయాత్నాలు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం, వైసీపీ విషప్రచారాన్ని తిప్పికొట్టడంపై చర్చించనున్నట్లు సమాచారం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

తిరుమలకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్న నేపథ్యంలో.. వారి మనోభావాలను గౌరవించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే గతంలో సీఎం మాట్లాడటం, విచారణకు ఆదేశించడం, అలాగే ఈ అంశంపై సుప్రీం కోర్టుకు పలువురు వెళ్లగా సీబీఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటై ఈ వ్యవహారంపై విచారించడం జరిగింది. సీట్ తన నివేదికను కేబినెట్ ముందు ఉంచగా నిన్న (మంగళవారం) ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.. నెయ్యి కల్తీ జరగడం వాస్తవమని తేలడంతో.. ఇందులో ఎవరు సూత్రధారులు అనేదానిపై కేబినెట్లో చర్చించడంతో పాటూ కల్తీకి ఆస్కారం ఇచ్చిన వారంతా బాధ్యులే అని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటి పంపకం అంశంపైనా ఈ సమావేశంలో చర్చ అనుకున్నట్లుగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కూటమి సమీకరణాల ప్రకారం టీడీపీకి రెండు స్థానాలు, జనసేనకు ఒకటి, కూటమి నిర్ణయాలన్నీ సమష్టిగా తీసుకున్నవే.. బీజేపీకి ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న. ఈ నేపథ్యంలో కూటమిలో సమన్వయం, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరిగే అవకాశముందని సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అజెండాలో ఉండనున్నాయి. అలాగే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో, ఆ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు రావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకంగా కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ ఇకపై కలిస్కిట్టుగా కార్యక్రమాలు నిర్వహించేలా స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవస్యకతపై చంద్రబాబు, పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే ఈ భేటీ సారాంశంగా చెబతున్నారు. సీఎం.డీసీఎం సమావేశం సుదీర్ఘ సమయం జరిగింది. సమావేశ వివరాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Politics Chandrababu Naidu Pawan Kalyan tirumala laddu controversy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.