ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రేపు తిరుమల లడ్డూ అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సభలో సమగ్రంగా చర్చించేందుకు నిర్ణయించింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ కొనసాగనుంది. ఈ వ్యవహారం భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉండటంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతలు వహిస్తున్నతిరుమల తిరుపతి దేవస్థానాల పై కూడా వివరణ కోరే అవకాశం ఉంది.
Read also: Kailasagiri Trishul Project: విశాఖ పర్యాటకానికి కొత్త శోభ: కైలాసగిరిపై ‘త్రిశూల్’
Tirumala laddu controversy
10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు
ఈ చర్చలో కూటమికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత ముఖ్యమంత్రి N.చంద్రబాబు నాయుడు సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై దర్యాప్తు, బాధ్యులపై చర్యలు వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు?
స్వల్ప అస్వస్థత కారణంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు సభకు హాజరుకాలేదు. అయితే రేపటి చర్చలో ఆయన పాల్గొనే అవకాశముంది. తిరుమల లడ్డూ వంటి ఆధ్యాత్మిక అంశంపై జరిగే చర్చకు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భక్తుల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పలు వర్గాలు కోరుతున్నాయి. రేపటి అసెంబ్లీ చర్చతో ఈ వివాదానికి దిశా నిర్దేశం లభించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: