📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Chandrababu Naidu: ప్రజలపై విద్యుత్ భారం లేదు..

Author Icon By Rajitha
Updated: February 10, 2026 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆర్టీసీలో వెయ్యి విద్యుత్ ఆధారిత బస్సులు కొనుగోలు: సిఎం చంద్రబాబు

విజయవాడ: ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Chandrababu Naidu మరోసారి స్పష్టం చేశారు. ట్రూ డౌన్ ఫలితాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్యుత్ కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, విద్యుత్, విత్తన నిర్వహణ, డ్రోన్లు, యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో భోజనానంతర సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ విధానాలు, పథకాల అమలుపై సీఎం సమీక్షించారు.

Read also: AP: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ : సీఎం చంద్రబాబు

There is no electricity burden on the people..

విద్యుత్ ఛార్జీల భారం తగ్గింపుపై సీఎం స్పష్టత

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్, ధరలు లభించేలా నిరంతర మానిటరింగ్ చేయాలన్నారు. గ్లోబల్ మార్కెట్ ఉన్న పంటలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. రాయలసీమను ఉద్యాన రంగంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర నిధులతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలన్నారు. ప్రస్తుతం రాయలసీమ నుంచి 220 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, త్వరలోనే 400 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 లేన్ రైల్వే లైన్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని వెల్లడించారు.

వ్యవసాయం–ఇంధన రంగాల్లో ఏఐ, గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యం

నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్ట్‌తో విద్యుత్ ఉత్పత్తి జరగాలని సీఎం సూచించారు. పీఎం కుసుమ్, సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలన్నారు. విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.90కి తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీలో కనీసం వెయ్యి బస్సులను ఈవీగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. కుప్పంలో 5 వేలకుపైగా ఈ-సైకిళ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. భూగర్భ జల మట్టాన్ని ఒక మీటర్ పెంచితే సుమారు రూ.4 వేల కోట్ల వరకు ఆదా అవుతుందని తెలిపారు.

బ్రాండింగ్, గ్రీన్ కవర్, స్వచ్ఛతపై సమగ్ర దిశానిర్దేశాలు

చిన్న రైస్ మిల్లు ఏర్పాటు చేయడానికి 30కుపైగా అనుమతులు అవసరం కావడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఆటంకం కలగకుండా నిబంధనలను సరళతరం చేయాలన్నారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, విద్యా శాఖలలో సంస్కరణలు అవసరమన్నారు. సింగిల్ విండో విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాజధాని నిర్మాణాలకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదన్నారు. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AgricultureAI AndhraPradesh APPolitics ChandrababuNaidu ElectricityCharges latest news PowerTariff Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.