పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుని ఆవిష్కరించిన పీ4 (Public-Private-People Partnership) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజా సమీక్ష సమావేశం నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పీ4 పథకం ప్రస్తుత ప్రగతిపై, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం లోతుగా చర్చించారు. ముఖ్యంగా “జీరో పావర్టీ” అనే ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించేందుకు అనేక రంగాల మద్దతుతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మార్గదర్శకుల ప్రాధాన్యత
ఈ కార్యక్రమంలో మార్గదర్శకులుగా (As guides) ఉండేందుకు 18,332 మంది ముందుకు వచ్చారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, ఉన్నత వర్గాల వారు ఉన్నారు. వీరి ద్వారా 1,84,134 బంగారు కుటుంబాలకు చేయూత లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు మార్గదర్శిగా ఉండేవారిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
మార్గదర్శకులకు ప్రోత్సాహక చర్యలు
పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే, మార్గదర్శకుల సహకారం కీలకమని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) అభిప్రాయపడ్డారు. స్వయంగా వారితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మార్గదర్శులుగా ఉండే 200 మంది టాప్ ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, భారీ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులు, సెలబ్రిటీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 18వ తేదీన అమరావతిలో వీరిని విందుకు ఆహ్వానించాలనే అంశంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది.
భవిష్యత్ కార్యాచరణ
చంద్రబాబు పీ4 పథకాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, సామాజిక ఉద్యమంగా మార్చాలని భావిస్తున్నారు. సమాజంలో పేదలకు అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్న అనేక వర్గాల వారిని ఒక తాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు .
చంద్రబాబు ఎన్ని సార్లు సీఎం అయ్యారు?
2024 ఎన్నికలలో భారీ విజయం సాధించిన తర్వాత, 2024 జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాయుడు నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థాపించారు?
తెలుగుదేశం పార్టీ ( తెదేపా పార్టీ ) ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో క్రియాశీలకంగా ఉన్న భారతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీ . ఇది 29 మార్చి 1982 న తెలుగు మాతృమూర్తి NT రామారావు (NTR)చే స్థాపించబడింది మరియు తెలుగు ప్రజలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించింది.
Read hindi news: hindi.vaartha.com_
Read also: TV Rama Rao : రామారావుపై జనసేన పార్టీ సస్పెన్షన్ వేటు!