📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Chandrababu Naidu: రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

Author Icon By Saritha
Updated: November 20, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సిఎం చంద్రబాబుపై నమ్మకంతోనే పెట్టుబడులు

కుప్పం : రాష్ట్రంలో సిఎం చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో జరుగుతున్న రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరని సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా బుధవారం ద్రవిడ వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి నారా భువనేశ్వరి ప్రసంగించారు. ఎపి రాష్ట్రం సన్రైజ్ రాష్ట్రం అన్నారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)తన బాధ్యతలను నెరవేర్చుతున్నారన్నారు. సిఎం చంద్రబాబు ఒక విజన్తో రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నా రన్నారు. పారిశ్రామికవేత్తలతో కూడా సిఎం చంద్రబాబు మాకోసం కాదు, రాష్ట్రం కోసం రావాలని కోరుతున్నారని పేర్కొన్నారు.

Read also: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు

Nara Bhuvaneshwari addresses students at Dravida University

నారా భువనేశ్వరి పర్యటనలో యువతకు పిలుపు

ఇటీవల జరిగిన సిఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16లక్షల ఉద్యోగాలకు అవకాశం రావడం జరిగిందన్నారు. మంత్రి లోకేష్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో వైజాగ్కు గూగుల్ సంస్థను తెచ్చారన్నారు. ఇప్పటికే వైజాగ్లో టిసిఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయన్నారు. మిట్టల్ గ్రూప్ సైతం రూ.1.40లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. రూ.9400 కోట్లతో నెల్లూరులో బిపిసిఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. కుప్పంలో సైతం ఇటీవలే రూ.2203 కోట్లతో ఏడు పరిశ్రమలు, 23,330 ఉద్యోగాలకు సంబంధించి సిఎం శంకుస్థాపన చేసిన విషయం గుర్తుచేశారు. దేశ(Chandrababu Naidu) భవిష్యత్తుకు యువత చేయి చేయి కలపాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణం 2029లో పూర్తవుతుందని సిఎం సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ 2026లో, పోలవరం ప్రాజెక్టు 2027 నాటికల్లా పూర్తవుతాయన్నారు.

యువత దేశ భవిష్యత్తు కోసం పనిచేయా లన్నారు. మనమంతా భారతీయులం అనే విషయం మరువరాదన్నారు. ద్రావిడ వర్సిటీని దివంగత ఎన్టీఆర్ స్థాపించారని విశ్వవిద్యాలయాన్ని యూనిక్ వర్సిటీగా చేయాలనే దిశగా సిఎం చంద్రబాబు ఆలోచిస్తు న్నారన్నారు. అనంతరం విద్యార్థులతో ఈ ముఖాముఖి నిర్వహించి వారు అడిగిన ప్రశ్నలకు నారా భువనేశ్వరి సమాధానం ఇచ్చారు. అంతకుముందు వర్సిటీలోని దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డా॥ కంచర్ల శ్రీకాంత్, ద్రావిడ వర్సిటీ విసి ఆచార్య ఎం. దొరస్వామి, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్కుమార్, టిటిడి బోర్డు సభ్యుడు వైద్యం శాంతారా o రెసో ఛైర్మన్ ప్రతాప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh AP Development Bhuvaneshwari Chandrababu Naidu cm Industrial Growth Investments Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.