📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: Chandrababu Naidu: భారత దేశమే అతిపెద్ద మార్కెట్..

Author Icon By Rajitha
Updated: October 4, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాచించే స్థాయి పోయింది..శాసించే స్థాయికి రావాలి -సిఎం చంద్రబాబునాయుడు Chandrababu Naidu విజయవాడ : మన దేశం ప్రపంచాన్ని యాచించే స్థాయిని దాటిపోయిందని… ఇకపై శాసించే స్థాయికి భారత్ చేరుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆత్మ నిర్బర్ అభియాన్ లో భాగంగా ఏర్పాటు చేసిన స్వదేశీ ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ముందుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. దేశీయంగా చేతివృత్తుల కళాకారులు ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను, ఆర్గానిక్ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు.

Rains : ఒడిశాలో వర్షాలు.. శ్రీకాకుళానికి వరద ముప్పు

ఖాదీ ఉద్యమంలో…స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫొటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. అలాగే ఆర్ఎస్ఎస్ RSS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను సీఎం సందర్శించారు. ఖాదీనంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”దసరా రోజు సంకల్పించిన ప్రతీ పని విజయవంతం అవుతుంది. స్వదేశీ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత కార్యక్రమం కూడా విజయం సాధిస్తుంది. ఖాదీసంత, స్వదేశీ భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా తయారవుతుందని ఆశిస్తున్నాను. ఆ దిశగానే భారత్ ముందడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారు. అందుకే బీఎస్ఎన్ఎల్ BSNL ఇటీవలే స్వదేశీ 4 స్టాక్ ను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

కోవిడ్ సమయంలో భారత్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయి. “అని సీఎం అన్నారు. గతంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి భారత్ ఇప్పుడు పటిష్టమైన స్థానానికి ఎదిగింది. 2038కి ఆర్ధికంగా రెండో స్థానానికి భారత్ చేరుతుంది. 2047 నాటికి అగ్రస్థానంలోకి వస్తాం. ఇదే భారత మాతకు నిజమైన నివాళి అవుతుంది. గతంలో శాటిలైట్ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్ చేసే పరిస్థితికి వచ్చేశాం. ప్రధాని మోదీ భారత దేశ మూలాలను ఎప్పుడూ గుర్తు తెస్తూనే ఉంటారు. ఆ మూలాలను వదిలిపెట్టకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. స్వాతంత్ర్యానికి పూర్వం 60 శాతం మేర వివిధ ఉత్పత్తుల ఎగుమతులు భారత్ నుంచి జరిగేవి. బ్రిటిషర్లు వచ్చాక పరిస్థితులు మారి విదేశీ వస్తువులు మనం వాడే స్థితికి చేరుకున్నాం. ఈ పరిస్థితి మారాలి. బీ ఇండియన్ బై ఇండియన్ అన్న నినాదం దేశమంతా రావాలి. దేశంలో ఉండే జనాభా మనకు అతిపెద్ద ఆస్తి, సంపద, అతిపెద్ద మార్కెట్.

విజయవాడలో ఏ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు?
విజయదశమి సందర్భంగా ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్వదేశీ ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఖాదీ సంతలో సీఎం ఏమి చేశారు?
మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి, ఖాదీ ఉత్పత్తుల స్టాళ్లు పరిశీలించారు. అలాగే రాట్నంపై నూలు వడికారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Atma Nirbhar Bharat Breaking News Chandrababu Naidu Khadi Santu latest news self reliant india Swadeshi Products Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.