📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Zurich meeting : దావోస్ మేన్ ఎవరు? జ్యూరిచ్‌లో చంద్రబాబు హైలైట్!

Author Icon By Sai Kiran
Updated: January 19, 2026 • 7:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Zurich meeting : ఆంధ్రప్రదేశ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్రియేటివ్ ఇండస్ట్రీలకు హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వేగంగా అడుగులు వేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన, జ్యూరిచ్‌లో ప్రముఖ మీడియా సంస్థ Eros Innovations ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏఐ, డిజిటల్ కంటెంట్ రంగాల అభివృద్ధే లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో ఈరోస్ ఇన్నోవేషన్స్ ప్రతినిధులు Kishore Lulla, రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తూ కిశోర్ లుల్లా “ఈయన దావోస్ మేన్” అని వ్యాఖ్యానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రంలో జనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీల వినియోగంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీకి ప్రత్యేకమైన జెన్‌ఏఐ మోడల్, (Zurich meeting) కంటెంట్ సూపర్ యాప్, విద్యారంగంలో ఏఐ భాగస్వామ్యం, ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, ప్రపంచ స్థాయి వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు ఏర్పాటు వంటి పలు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. అలాగే ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ టూరిజం ప్రాజెక్టు, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ ఏర్పాటుపై కూడా ఆలోచనలు వ్యక్తమయ్యాయి.

ఈ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ మరియు డిజిటల్ కంటెంట్ ఎకానమీ లో అగ్రస్థానంలో నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. World Economic Forum సదస్సు (WEF-26) నేపథ్యంలో ఈ భేటీ జరగడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AI creative companies India AI Film City Andhra Pradesh AI hub AP digital economy Breaking News in Telugu Chandrababu Naidu Davos Man comment Discover Andhra Pradesh 360 Eros Innovations Generative AI projects Google News in Telugu Kishore Lulla Latest News in Telugu Telugu News Virtual Tourism Andhra Pradesh WEF 2026 Zurich meeting

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.