📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Chandrababu Naidu: రాజధానికి భూములిచ్చిన రైతులకు చంద్రబాబు ధన్యవాదాలు

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 5:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. రూ.260 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఆలయ విస్తరణ పనులకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ బృహత్తర కార్యాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) (TTD) అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజధాని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: AP ఉద్యోగాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Chandrababu thanks the farmers who gave land for the capital

ఆలయ విస్తరణ పనులు: రెండు దశల ప్రణాళిక

ఆలయ విస్తరణ పనులను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు:

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం: అమరావతి ప్రాముఖ్యత, గత ప్రభుత్వ విమర్శలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతోనే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని గుర్తు చేశారు.

“దేవతల రాజధాని అమరావతే మన రాజధానిగా ఉండాలని సంకల్పించాం. కృష్ణానది ఒడ్డున 25 ఎకరాల్లో 2019లోనే ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాం. కానీ గత ప్రభుత్వం విధ్వంసం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేస్తే, వారికి గత ఐదేళ్లు నరకం చూపించారు. ఆ వెంకన్ననే నమ్ముకున్న రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో పాదయాత్ర చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు.

వ్యక్తిగత భక్తి, నక్సల్ దాడి జ్ఞాపకాలు: తాను శ్రీవారికి పరమ భక్తుడినని, తమ ఇంటి దైవం ఆయనేనని చంద్రబాబు తెలిపారు. “మా ఇంటి నుంచి చూస్తే శేషాచల పర్వతం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తూ పెరిగాను. స్వామికి అప్రతిష్ఠ తెచ్చే ఏ పనీ చేయను, ఎవరినీ చేయనివ్వను. తప్పు చేస్తే ఆయనే ఈ జన్మలో శిక్షిస్తాడు. నాడు స్వామివారి సేవకు వెళ్తుంటే నక్సలైట్లు 23 క్లైమోర్ మైన్లు పేల్చినా, ఆ స్వామి దయ వల్లే ప్రాణాలతో బయటపడ్డాను” అని నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానానికి శ్రీకారం చుడితే, తాను స్విమ్స్‌లో ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పారు.

భవిష్యత్ ప్రణాళికలు, పిలుపు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాన్ని చేపడతామని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. ముంబైలో రేమాండ్స్ సంస్థ రూ.100 కోట్లతో స్వామి ఆలయాన్ని నిర్మిస్తోందని ఉదహరించారు. భక్తులు కూడా ఆలయ నిర్మాణాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంపదతో వర్ధిల్లాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amaravati Venkateswara Temple Andhra Pradesh Temples BR Naidu capital farmers CM Chandrababu naidu Google News in Telugu Hindu spiritual development. Latest News in Telugu Telugu News Today Temple expansion TTD development;

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.