📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu Naidu : సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: July 28, 2025 • 8:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) తెలిపారు. క్రీడలు పర్యాటకానికి, వాణిజ్యానికి కూడా దోహదం చేస్తాయని చెప్పారు. అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ స్పోర్ట్స్ పాలసీ రూపొందించామని వివరించారు.సోమవారం సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు, ప్రముఖ కోచ్ పుల్లెల గోపిచంద్‌తో కలిసి స్పోర్ట్స్ స్కూల్‌ (Sports School) ను సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్‌తో భేటీ అయ్యారు.

Chandrababu Naidu : సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్లో చంద్రబాబు

ఏపీలో క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం

ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడా రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచినట్లు చెప్పారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ పతక విజేతలకు భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న వారికి రూ.7 కోట్లు అందజేస్తామని చెప్పారు. రజత పతక విజేతలకు రూ.5 కోట్లు, కాంస్య పతక విజేతలకు రూ.3 కోట్లు ఇస్తామని వెల్లడించారు.అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. తిరుపతి, వైజాగ్, అమరావతిలో సమగ్ర క్రీడా సముదాయాలను నిర్మించనున్నట్లు తె లిపారు. కడప, విజయవాడ, విజయనగరంలో సింగపూర్ తరహా స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు.

సింగపూర్ మోడల్‌పై ప్రేరణ

స్కూల్ ప్రిన్సిపాల్ ఓంగ్ కిమ్ సూన్ సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ విధానాన్ని వివరించారు. హైపర్‌ఫార్మెన్స్ సిస్టంను అమలు చేసి, 12 ఏళ్ల వయసు నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జాతీయ క్రీడా అకాడమీలతో స్కూల్‌ను అనుసంధానం చేసామని వివరించారు.చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో పెద్దఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్నామని తెలిపారు. క్రీడలు, పర్యాటకం, వాణిజ్యం కలిసేలా కొత్త విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

Read Also : Hyderabad : గోల్కొండ కోట ప‌రిస‌రాల్లో చిరుత పులి

AP CM Chandrababu in Singapore Chandrababu Naidu Foreign Visit Chandrababu Naidu Singapore News Chandrababu Naidu Singapore visit Chandrababu Naidu Sports School Tour Chandrababu Singapore Sports School Chandrababu Singapore Tour Chandrababu Sports School Visit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.