Bharatiya Vignan Sammelan: భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) దేశానికి ఉన్న ప్రాచీన వైభవం, విజ్ఞాన సంపదను గుర్తు చేశారు. ఈ వేదికపై మాట్లాడుతూ భారత సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. భారతీయతపై చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
Read also: YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం
ప్రాచీన కాలంలోనే భారత్ విజ్ఞానానికి నిలయంగా ఎదిగిందని చంద్రబాబు తెలిపారు. వేలేళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా పట్టణ వ్యవస్థల ప్రణాళికను ప్రపంచానికి చూపిందని చెప్పారు. అలాగే, సుమారు 2900 ఏళ్ల క్రితమే యోగ సాధన ప్రారంభమైందని, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) కృషితో ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా దేశాల్లో యోగా విస్తరించిందని గుర్తు చేశారు. 2600 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ద్వారా వైద్య విధానాలు అమలులోకి వచ్చాయని ఆయన వివరించారు.
తక్షశిల, నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల ద్వారా ప్రపంచానికి విద్యను అందించిన ఘనత కూడా భారతదేశానిదేనని చంద్రబాబు అన్నారు. సున్నా ఆవిష్కరణ, మేధస్సును పెంపొందించే చదరంగం ఆవిర్భావం కూడా భారతీయుల తెలివితేటలకు నిదర్శనమన్నారు.
ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట(Aryabhatta), గణితంలో భాస్కరాచార్య, వైద్యంలో చరక, ధన్వంతరి, అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వంటి మహానుభావులు భారత విజ్ఞాన సంప్రదాయానికి ప్రతీకలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించిన మహనీయులతో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: