విజయవాడ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ (GST)సంస్కరణల ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దసరా నుంచి దీపావళి వరకు ‘జీఎస్టీ ఉత్సవాలు‘ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఆసియా కప్ 2025 ఫైనల్- పాకిస్తాన్‌పై భారత్ విజయం – ప్రధాని మోదీ స్పందన
జీఎస్టీతో ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ధి
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తీసుకున్న జీఎస్టీ సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని సీఎం గుర్తుచేశారు. ఈ సంస్కరణలతో ఏపీ ప్రజలకు రూ.8 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతుందని వెల్లడించారు. పారిశ్రామిక, ఆటోమొబైల్, ఫార్మా వంటి కంపెనీలకు జీఎస్టీ సంస్కరణ మేలు చేస్తుందని, ద్విచక్ర వాహనాలు, కార్లు, వంటింటి వస్తువుల ధరలు తగ్గుతాయని వివరించారు. రోగులు వాడే మందులపై కూడా జీఎస్టీ తగ్గిందని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు కొనడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి ప్రజలకు ఈ ప్రయోజనాలను వివరించాలని ఆయన కోరారు.
విద్యుత్ రంగంలో రూ.1000 కోట్లు ఆదా
గత వైఎస్సార్ కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అవలంభించిన అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడిందని సీఎం ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామని, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టడం ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామని వివరించారు. ఆ మేరకు రానున్న కాలంలో ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామని వెల్లడించారు. ‘సూపర్ సిక్స్’ హామీలను నెరవేర్చామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా జగన్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నిస్తూ.. 11 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రావడం లేదని, ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తున్నారని విమర్శించారు.
ప్రచార కార్యాచరణ, కమిటీ ఏర్పాటు
జీఎస్టీ ప్రచారానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హెచ్‌ఆర్‌డీ మంత్రి లోకేశ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం మంత్రి కందుల దుర్గేష్‌లు ఉన్నారు. ఇంటింటికీ జీఎస్టీ కరపత్రాలు తీసుకెళ్లి, వ్యవసాయం, ఇతర అంశాల్లో ఎలా లబ్ధి కలుగుతుందో వివరిస్తారు. అక్టోబర్ 7, 8 తేదీల్లో విద్యా సంస్థల్లో, అక్టోబర్ 9న విలేజ్ హెల్త్ సెంటర్లలో, అక్టోబర్ 11న బిల్డింగ్ వర్కర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
‘జీఎస్టీ ఉత్సవాలు’ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తారు?
దసరా నుంచి దీపావళి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
జీఎస్టీ సంస్కరణల వల్ల ఏపీ ప్రజలకు ఎంత లబ్ధి కలుగుతుంది?
ఈ సంస్కరణల వల్ల ఏపీ ప్రజలకు సుమారు రూ.8 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతుందని సీఎం తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: