हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu: బాలకృష్ణ కు జాతీయ అవార్డు.. అభినందనలు తెలియచేసిన సీఎం చంద్రబాబు

Sharanya
Chandrababu: బాలకృష్ణ కు జాతీయ అవార్డు.. అభినందనలు తెలియచేసిన సీఎం చంద్రబాబు

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న “భగవంత్ కేసరి” (Bhagwant Kesari) సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం చిత్ర బృందానికి గర్వకారణంగా మారింది. ఈ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు బాలకృష్ణ, కృషికి ఈ అవార్డు తగిన ఫలితంగా నిలిచింది.

ఇతర తెలుగు చిత్రాలకు కూడా జాతీయ గుర్తింపు

ఈ ఏడాది జాతీయ అవార్డు (National Award)ల్లో తెలుగు సినిమాలకు అనేక విభాగాల్లో గౌరవాలు లభించాయి.

  • హనుమాన్ సినిమాకు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగాల్లో అవార్డులు దక్కాయి.
  • బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్‌ప్లే (రచన – రాజేష్ నీలం) మరియు ఉత్తమ నేపథ్య గాయకుడిగా PVSN రోహిత్‌కు అవార్డు లభించింది.
  • పార్కింగ్ చిత్రానికి గానూ రచయిత రామ్‌కుమార్‌కు ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కింది.
  • బలగం సినిమాలోని “ఊరూ పల్లెటూరు” పాటకు గీత రచయిత కాసర్ల శ్యామ్‌కు ఉత్తమ లిరిక్స్ అవార్డు లభించింది.
  • గాంధీతాత చెట్టు సినిమాలో నటించిన దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డును గెలుచుకుంది.
  • సార్ (వాతి) సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు.
  • ఉత్తమ గాయనులుగా – శిల్పా రావ్ (ఫిమేల్ – జవాన్ సినిమా) మరియు పివిఎన్‌ఎస్ రోహిత్ (మేల్ – బేబీ సినిమా) ఎంపికయ్యారు.

సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు – తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహం

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఎక్స్ వేదికగా (ట్విటర్) స్పందిస్తూ జాతీయ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా భగవంత్ కేసరి చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

“71వ జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలకు హృదయపూర్వక అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పురస్కారాలను అందుకున్న ప్రతి ఒక్కరికీ గర్వకారణమైన ఈ ఘనతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అంతేకాకుండా జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికైన షారుక్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాసే (12th ఫెయిల్), ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ (కేరళ స్టోరీ), సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్‌కు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/constable-results-police-constable-results-released-home-minister-anitha-announcement/andhra-pradesh/524682/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870