📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Van Mahotsav : అమరావతిలో మొక్కలు నాటిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Author Icon By Sudheer
Updated: June 5, 2025 • 7:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (World Environment Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి(Amaravathi)లో వనమహోత్సవం (Van Mahotsav) కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అమరావతిలోని అనంతవరంలోని ఏడీసీఎల్ పార్క్‌లో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని వారు వ్యక్తపరిచారు. అనంతరం జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

చెత్తను కూడా సంపదగా మార్చే సాంకేతికత

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. చెత్తను కూడా సంపదగా మార్చే సాంకేతికతను వినియోగించేందుకు రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శిస్తూ, వారికి చెట్లు నరుకుటే తెలుసు, కానీ మొక్కలు నాటి వాటిని పెంచడం తెలియదని అన్నారు. రాబోయే రాఖీ పండుగ సందర్భంగా ‘సీడ్ రాఖీలు’ను ఉపయోగించాలని, ప్రతి సోదరుడి జన్మనక్షత్రానికి తగిన చెట్టు విత్తనాలను సీడ్ రాఖీల రూపంలో సోదరులు కట్టించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

చెట్టు మన జీవనాదారం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో చెట్టు మన జీవనాధారమని, చెట్లు లేని భూమిని ఊహించలేమని స్పష్టంగా చెప్పారు. నల్లమల అటవీ పరిరక్షణ కోసం 30 ఏళ్లుగా అలుపెరగని కృషి చేస్తున్న కొమ్మిర అంకారావు సేవలను ఉదహరిస్తూ, భవితరాలకు ఆయన జీవితం గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ప్రకృతి రక్షణ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also : Sonam Raghuvanshi: భర్త హత్య, భార్య అదృశ్యం కేసులో కీలక పరిణామం

CM chandrababu Pawan Kalyan Van Mahotsav World Environment Day

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.