ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మరియు ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నాయుడు, ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు- గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని పొగాకు ఉత్పత్తిని కంపెనీలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బర్లీ పొగాకును క్వింటాల్ కు రూ. 12,500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే కోకో గింజలను కూడా కిలోకు రూ. 500 తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బర్లీ పొగాకును క్వింటాల్‌కు రూ.12,500 చెల్లించి కంపెనీలు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ మేరకు ఐటీసీ, జీపీఐ వంటి ప్రముఖ సంస్థలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైతుల వద్ద ఎక్కడా నిల్వలు మిగలకుండా ఆయా సంస్థలు కంటిన్యూ గాను కొనుగోళ్లు జరపాలని తెలిపారు.
ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన:
మిర్చి పంట, కోకో పంట నష్టాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఖరీఫ్ సీజన్‌కు సన్న రకాలు సాగు చేయాలని రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చంద్రబాబు సూచించారు. ఈ నిర్ణయాలు వర్షాభావం, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఉపశమనం కలిగించనున్నాయి.
కర్నూలు పర్యటన
మరోవైపు ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కర్నూలు సీ క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించనున్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయ వద్ద స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను వివరించే అవకాశం ఉంది.
Read also: Rain Alert: రానున్న ఐదు రోజుల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు