📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Chairman Buchiram Prasad: బ్రాహ్మణుల సంక్షేమానికి పాటుపడతా

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్

విజయవాడ : గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే. బుచ్చి రామ్ ప్రసాద్ (Chairman Buchiram Prasad) తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆలా నిర్వీర్యం చేసినా బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి అన్ని పథకాలతో పునరుద్ధరిస్తాం.గతంలో ఎవరూ బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్నవారు లేరని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణుల సంక్షేమాన్ని మానిఫెస్టోలో పెట్టారని తెలిపారు.

దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కమిటీ

దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం (Welfare of Brahmins) కోసం అంకిత భావంతో పనిచేస్తా నన్నారు. దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం కమిటీలు వేశామని అన్నారు. హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కమిటీ వేయాలని చూస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో 1,000 హిందూ దేవాలయాలు కట్టించాలని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.

దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశీర్వదించబడిన బుచ్చిరామ్ ప్రసాద్ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు దేవదాయశాఖ కూడా తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు.

Chairman Buchiram Prasad

ఆర్థిక ఇబ్బందులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల ఎంతో చేయూతను అందిస్తున్నదని, దేవాలయాల పాలకవ ర్గంలో బ్రాహ్మణులకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించేందుకు నిబంధనలు కూడా మార్చామని తెలిపారు. వేద పండితుల ఆర్థిక ఇబ్బందులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు సంభావనను అందించామన్నారు.

అర్చక వృత్తిలో ఉన్న బ్రాహ్మ ణులకు గౌరవ వేతనం రూ. 10 వేల నుండి 15 వేలకు పెంచి అందిస్తున్నాం.ధూప దీప నైవైద్యం పథకం క్రింద గతంలో కన్నా కొత్తగా 380 ఆలయాలు నిర్మించేందుకు మంజూరు చేశామని తెలిపారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ముఖ్యమంత్రికి చిత్త శుద్ధి

దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ముఖ్యమంత్రికి చిత్త శుద్ధి ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధికి నిర్వహణకు అవసరమైన నిధులు ఇంకా కావాలన్నా కేటాయిం చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలియజేశారు.

చైర్మన్ ను అభినందించిన వారిలో శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, ఏపి ఎన్ఆర్ఐ చైర్మన్ వేమూరి రవి, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొంషన్ ఎండి ఎం. చిన్నబాబు, సీఈవో నాగ సాయి, సీనియర్ మేనేజర్ హెచ్. ఆర్. ఎల్.శ్రీనివాస్, తదితర సిబ్బంది ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anam Ramanarayana Reddy Brahmin Corporation Brahmin welfare Breaking News Buchiram Prasad Gollapudi latest news state initiatives Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.