📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CH. Baburao: ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర: సిహెచ్.బాబూరావు

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CH. Baburao: విజయవాడ : విజయవాడలో రూ. 400 కోట్ల రూపాయల విలువైన, ఐదు ఎకరాల పాత బస్టాండ్ ఆర్టీసీ స్థలాన్ని బడా కంపెనీ లూలూ మాల్ (Lulu Mall) కి కట్టబెట్ట డానికి నిరసనగా విజయవాడలో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళన నిర్వ హించారు. ఈ సందర్భంగా బాబురావు, కాశీ నాథ్ మాట్లాడుతూ ఆంధ్రులను దెబ్బతీసి విదేశీ సంస్థలకు భూములు, ప్రజల ఆస్తులు పందారం చేయటం నమ్మక ద్రోహమేనన్నారు. 25 దేశాల లో వేలకోట్ల రూపాయలు వ్యాపారం చేసే బడా సంస్థ లులుకి ప్రభుత్వం దాసోహం అనడం భారీ కుంభకోణానికి దారితీస్తుందన్నారు. ఆర్టీసీని కాపాడవలసిన పాలకులే, ఆర్టీసీ ఆస్తులను బడా సంస్థలకు రాసి ఇవ్వటం గర్హనీయమన్నారు. ఆర్టీసీ బస్సులు, డిపోలకు నిలువ నీడ లేకుండా చేస్తూ, విదేశీ సంస్థలకు ఊడిగం చేయటం చంద్రబాబు, పవన్కు తగునా? అని ప్రశ్నిం చారు. కాలవ కట్టలపై పేదలు నివసించడానికి వీలు లేకుండా తరిమేస్తూ, రైవాస్ కాలవ ఒడ్డున బడా కంపెనీల మాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటం, భూములు కట్టబెట్టడం తగునా? అని అడిగారు. లులుమాల్ వలన వందలాది మందికి ఉపాధి వస్తుందని నమ్మిస్తూ, వేలాదిమంది చిరు వ్యాపారుల పొట్ట గొట్టడం అమానుషమన్నారు.

CH. Baburao: ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర: సిహెచ్.బాబూరావు

విదేశీ సంస్థలకు ప్రభుత్వ ఆస్తుల కట్టబెట్టలా?

CH. Baburao: విశాఖలో 13 ఎకరాలు, విజయవాడలో ఐదు ఎకరాలు లులు సంస్థకు ధారాదత్తం చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తులను విదేశీ బడా కంపెనీలకు కట్టబెట్టే నైతిక అధికారం పాలకులకు లేదు అని స్పష్టం చేశారు. పి ఫోర్ అంటే పేదరిక నిర్మూ లన అంటే లులు సంస్థకు దాసోహం అనట మేనా? అని ప్రశ్నించారు. చిన్నా, మధ్యతరగతి వ్యాపారులపై పన్నుల భారాలు వేస్తూ, వారిని వేధిస్తూ, బడా సంస్థలకు మాత్రం రాయితీలు ఇవ్వడం శోచనీయమన్నారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ నిర్మాణానికినాడు పేదలు తమ ఇళ్లను కోల్పోయి సహకరిస్తే, నేడు బస్సు డిపోలను ప్రభుత్వాలు విదేశీ సంస్థలకు అప్పగించడం దారుణమన్నారు. బృందావన్ కాలనీలోని 25 కోట్ల రూపాయల విలువైన మున్సిపల్ స్థలాన్ని రాఘవేంద్ర మఠానికి ఇస్తూ విజయవాడను క్రమంగా అమ్మకానికి పెడుతున్నారని అన్నారు. సంపద సృష్టి అంటే ప్రభుత్వ, ప్రజల సంపదను విదేశీ బడా కంపెనీలకు కట్టబెట్టటమేనా? అని అడిగారు. ఇప్పటికే లక్షలాదిమందికి ఉపాధి చూపుతున్న చిన్నా, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమల నుండి పన్నులు, విద్యుత్ చార్జీల రూపంలో పీక్కుతింటూ, బడా సంస్థలకు మాత్రం భూములు, రాయితీలు ఇస్తూ నెత్తిన పెట్టుకోవడం సమంజసమా? అని అడిగారు. ఆర్టీసీ బస్టాండ్ స్థలం పక్కనే ఉన్న పార్కును సైతం దాఖలు పరిచే ప్రయత్నాలు సరికాదు అని చెప్పారు. ఇప్పటికే లులు సంస్థపై కోర్టులలో అనేక కేసులు నడుస్తుండగా, పాలకులు నిసి గ్గుగా ఆ సంస్థకు దాసోహం అనటం బాధాకర మన్నారు.

ఆర్టీసీ అంటే అర్థం ఏమిటి?

RTC అంటే సాధారణంగా రియల్-టైమ్ క్లాక్ అని అర్థం, ఇది పరికరం పవర్ ఆఫ్ చేయబడినప్పుడు కూడా సమయం మరియు తేదీని ట్రాక్ చేసే గడియారం రకం. ఇది కంప్యూటర్లు, డిజిటల్ కెమెరాలు మరియు మరిన్నింటి వంటి వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలలో ఖచ్చితమైన సమయపాలనను నిర్వహించడానికి ఉపయోగించబడుతుంది. అయితే, RTC సందర్భాన్ని బట్టి ఇతర విషయాలను కూడా సూచించవచ్చు, ఉదాహరణకు రవాణా రంగంలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లేదా వైద్యంలో రిటర్న్ టు క్లినిక్.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nara Lokesh: మేటి ఐటి కేంద్రగా విశాఖ

Breaking News ch baburao foreign company opposition latest news lulu mall protest rtc land issue Telugu News Vijayawada news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.